Advertisement
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆయన కట్టించిన రాజమండ్రి జైల్లోనే శిక్షని అనుభవిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటీషన్ తో పాటు బెయిల్ కోసం హై కోర్ట్ లో అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసుల విచారణ జరగనుంది. మరో వైపు అమరావతి భూముల వ్యవహారంపై కూడా సిఐడి విచారణ చేయనుంది.
Advertisement
ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ బాబు కూడా తన తండ్రిని బయటకు తీసుకురావడంపై ప్రతిజ్ఞ బూనాడు. ఏవి ఎలా ఉన్నా.. జగన్ మాత్రం చెక్కు చెదరడం లేదు. తనకి 16 నెలలు జైలు జీవితం చూపించడంపై జగన్ చాలానే కోపం పెట్టుకున్నట్లు ఉన్నాడని పలువురు భావిస్తున్నారు. ఇక వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు వంత పాడే రామోజీ రావుపై వైసీపీ కన్ను పడిందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Advertisement
వైసీపీ ప్రస్తుతం టీడీపీ ఆర్ధిక మూలాలను సమూలంగా నాశనం చేయడమేనని నెటిజన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ సిఐడి మార్గదర్శి కేసుని రీ ఓపెన్ చేసింది. ఈనాడు రామోజీరావు, ఆయన కోడలు శైలజతో పాటు మొత్తం 13 మందికి ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. ఈ కేసు కౌంటర్ కోసం 18 వరకు గడువుని కూడా ఇచ్చారు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన ఆర్ధిక అవకతవకలు, నిధుల మళ్లింపు, రికార్డుల నిర్వహణ విషయాలపై రామోజీరావు పై ప్రశ్నలు సంధించింది. హై కోర్ట్ ఈ కేసును 18 వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు ఏపీ సిఐడి ఇప్పటికే ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.