Advertisement
ఫ్లైట్ లో ప్రయాణం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎంత దూరం అయినా కూడా కొన్ని గంటల్లోనే వెళ్లిపోవచ్చు ట్రైన్ లో కానీ బస్సు లో కానీ రెండు మూడు రోజులు పట్టే ప్రయాణం ఫ్లైట్లో అయితే కొన్ని గంటల్లోనే మనం వెళ్లిపోవచ్చు. కానీ ఫ్లైట్లో వెళ్లాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ఆకాశంలో ప్రయాణించడానికి వీలుగా విమానాన్ని డిజైన్ చేశారు. ఇదివరకు విమానాన్ని ఎక్కాలని చాలా మంది కలలు కనేవారు. ఇప్పుడు మాత్రం చాలా మంది చాలా ఈజీగా ఫ్లైట్ లో వెళ్లి వెళ్తూ వస్తున్నారు.
Advertisement
గత కొన్ని నెలల నుండి చూసుకున్నట్లయితే విమాన ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే చాలామంది విమానంలో వెళ్ళేటప్పుడు కిటికీ పక్కన కూర్చోవాలని అనుకుంటారు కిటికీ పక్కన కూర్చుంటే వ్యూ కనబడుతుంది. అయితే కిటికీ పక్కన కూర్చున్నప్పుడు గమనించినట్లయితే విమాన కిటికీ తలుపులు గుండ్రంగా ఉంటాయి.
Advertisement
మామూలుగా మనం ట్రైన్ లో బస్సులో చూస్తే అవి గుండ్రంగా వుండవు. స్క్వేర్ లేదా రెక్టాన్గిల్ ఆకారంలో కనబడతాయి. కానీ విమానాల్లో గుండ్రంగా ఉంటాయి ఎందుకు ఇవి గుండ్రంగా ఉంటాయి అంటే.. మొదట్లో కంటే ఇప్పుడు వినిమానాల్లో ఎన్నో మార్పులు చేసారు. విమానం వేగం మొదలు ఎత్తు వరకు చాలా మార్పులొచ్చాయి. కిటికీలని గుండ్రంగా డిజైన్ చేయడం మొదలుపెట్టారు విమానం వేగంగా వెళ్లేటప్పుడు విండో గాలి ఒత్తిడిని తట్టుకునేలా ఉండేందుకు ఇలా డిజైన్ చేశారు.
గుండ్రంగా ఉంటే గాలి ఒత్తిడిని సులభంగా తట్టుకోగలుగుతుంది అదే ఒకవేళ వేరే ఆకారంలో ఉంటే పగుళ్ళు ఏర్పడవచ్చు. గుండ్రంగా ఉండడం వలన అలాంటి పగుళ్లు ఏర్పడవు. అందుకే విమానం కిటికీ తలుపులు గుండ్రంగా ఉంటాయి. ఒకే చోట కాకుండా కిటికీ చుట్టూ ఒత్తిడి పడుతుంది దాంతో ఇబ్బంది ఉండదు అందుకే కిటికీ తలుపుల్ని ఈ విధంగా డిజైన్ చేశారు.
Also read:
ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళు ఎందుకు ఒకే చోట ఉండకూడదు..? కారణం ఏమిటి అంటే..?
కొత్త వాచీలలో టైమ్ ని 10:10 అనే ఎందుకు పెడతారు..? ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా…?