Advertisement
మనం పంచదారని ఎక్కడైనా పెట్టినట్లయితే జాగ్రత్తగా స్టోర్ చేస్తూ ఉంటాము, ఏ చీమలు పట్టకుండా జాగ్రత్తగా వాటిని పెడుతూ ఉంటాము. చీమలు తీపి ని ఇష్టపడుతూ ఉంటాయి ఈ విషయం మనకి తెలిసిందే. చీమలు ఎందుకు తీపి కి ఎట్రాక్ట్ అవుతాయి..? తియ్యటి ఆహార పదార్థాలు ఉన్నచోట చీమలు ఎందుకు పడతాయి దాని వెనక అర్థం ఏంటనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాము.. చీమలు కష్టజీవులు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. వీటికి ఎనర్జీ చాలా అవసరం ఉంటుంది.
Advertisement
ఎప్పుడూ కష్టపడతాయి కాబట్టి కచ్చితంగా ఓపిక ఎక్కువ ఉండాలి షుగర్ లో చూసినట్లయితే కేలరీలు బాగా ఎక్కువగా ఉంటాయి. పైగా షుగర్ తీసుకోవడం వలన సులభంగా జీర్ణం అయిపోతూ ఉంటుంది. చీమలు పంచదార మొదలైన తీయటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాయి. తీయటి పండ్లు కూడా చీమలు తింటూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన బాగా ఎనర్జీ వస్తుంది.
Advertisement
పైగా షుగర్ క్యూబ్స్ బరువు తక్కువ ఉంటాయి. వాటిని చీమలు మోసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అందుకే చీమలు తియ్యటి ఆహార పదార్థాలుని, తియ్యటి పండ్లని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి మోసుకెళ్లడానికి ఈజీగా ఉంటుందని పంచదార వంటి వాటిని తీసుకెళ్తూ ఉంటాయి చీమలు. చీమలు ఎక్కువ పని చేస్తూ ఉంటాయి కాబట్టి తీయటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి సామర్థ్యం వస్తుందని ఇలా చేస్తుంటాయి చీమలు. ఇదే అండి చీమలు తీయటి ఆహార పదార్థాలని ఇష్టపడటానికి కారణం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!