Advertisement
మీరు ఎప్పుడో ఒకప్పుడు రైలులో ప్రయాణించే ఉంటారు. రైలు ప్రయాణం చాలా సేఫ్.. అందుకే ఎక్కువమంది రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అదేవిధంగా దూరపు ప్రయాణాలు చేసే వారి కోసం అధికారులు కొత్త సర్వీసులను అందించడంతోపాటు కొత్త సదుపాయాలను అందిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా రైళ్లలో కోచ్ ల క్రమం ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా..? రాజధాని, శతాబ్ది వంటి పూర్తిస్థాయి ఏసీ రైలు మినహా చాలా ఎక్స్ప్రెస్ రైళ్లలో మొదట ఇంజన్, ఆ తరువాత జనరల్ బోగీ, ఆ తర్వాత స్లీపర్, ఏసీ బోగీ, చివరిగా మళ్లీ జనరల్ బోగి ఉంటుంది.
Advertisement
Read also: రష్మికని అంతలా వేధించారా ? ‘కాంతార’ సినిమాకు ఆమెకు సంబంధం ఏంటి?
Advertisement
అంటే రైలుకి ఇంజన్ వెనకాలి భాగం జనరల్ బోగీ, మళ్లీ చివరి భాగం జనరల్ బోగి ఉంటుంది. ఏసీ లేదా పైతరగతి కోచ్ లు మాత్రం రైలు మధ్యభాగంలోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైలులోని కోచ్ ల అమరిక ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏసీ కోచ్ లు, లేడీస్ కంపార్ట్మెంట్ లను రైలు మధ్య భాగంలో ఉంచుతారు. ఇంజన్ పక్కన ఉన్న కోచ్ లను లగేజీని ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇంజన్ వెనక బాగాన ఉన్న కంపార్ట్మెంట్ ని లగేజ్ కోచ్ అని అంటారు. ఏసీ కోచ్ లో కూర్చున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇలా చేశారని ఒక వివరణ ఉంది.
అలాగే రైల్వే స్టేషన్ లోని ఎగ్జిట్ గేట్లు స్టేషన్ మధ్యలో ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇది ఫ్లాట్ ఫారంలో రైలు ఆగినప్పుడు ఈ ఏసీ కోచ్ లు ఎగ్జిట్ గేటుకు దగ్గరగా ఉంటాయి. దీనివల్ల ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులు త్వరగా బయటికి రాగలుగుతారు. ఇక ఇంజన్ బోగీల పక్కనే ఏసీ కోచ్ లను ఏర్పాటు చేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. ఆ కారణంగా కూడా ఏసీ బోగీలను రైలు మధ్యలో ఏర్పాటు చేస్తారని చెబుతుంటారు.
Read also: ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మంచి కం బ్యాక్ ఇచ్చిన 10 సినిమాలు