Advertisement
అటల్ బిహారీ వాజపేయి జీవితంలో రాజ్ కుమారి కౌల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏముంది…? వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు చూసేద్దాము. గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ లో చదివేటప్పుడు రాజ్‌కుమారి హక్షర్ కౌల్ పట్ల వాజ్‌పేయీ ని చూసి అట్రాక్ట్ అయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ పుస్తకంలో ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ ప్రస్తావించిన విషయాలు ఇవి. అప్పట్లో గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ లో తక్కువ మంది అమ్మాయిలే ఉండేవారట. కౌల్ చాలా అందంగా ఉండేవారు. ఆమెను వాజ్‌పేయీ ఎంత గానో ఇష్టపడేవారు. కౌల్‌కు కూడా ఆయన అంటే ఇష్టం.
Advertisement
కౌల్ సోదరుడు చంద్ హక్షర్ వాజ్‌పేయీకి పరిచయం అయ్యారట. తరవాతే కౌల్ ని కలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీళ్ళ పెళ్లి కి కౌల్ కుటుంబం వాజ్‌పేయీని ఒప్పుకోలేదు. కౌల్‌ను తల్లిదండ్రులు దిల్లీలోని రామ్‌జస్ కాలేజీ లో ఫిలాసఫీ ని టీచ్ చేసే బ్రజ్ నారాయణ్ కౌల్ తో పెళ్లి చేశారు. వాజ్‌పేయీతో తనకున్న అనుంబంధాన్ని కౌల్ ఓపెన్ గానే చెప్పేవారట. వాజ్‌పేయీ లైబ్రరీ పుస్తకంలో ప్రేమ లేఖ ని రాసి పెట్టి కౌల్‌కు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆయనకు ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదట. కౌల్ ఆ లేఖ ని చదివారు.
Advertisement
దానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. కానీ ఆ లేఖ వాజ్‌పేయీకి చేరలేదు. అందుకే తెలీలేదు. 1980ల్లో సావి మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాజ్‌పేయీకి తనకు మధ్య మంచి అనుబంధముందని ఒప్పుకున్నారు రాజ్‌కుమారి. ఎంపీగా దిల్లీకి వచ్చిన తర్వాత కౌల్‌ను కలవడం స్టార్ట్ చేసారు వాజ్‌పేయీ. వాజ్‌పేయీకి నాతోపాటు నా భర్తతోనూ మంచి రిలేషన్ ఉందని, అందుకే వాజ్‌పేయీతో నా అనుబంధం గురించి నా భర్తకు వివరణ ఇవ్వవలసిన అవసరం రాలేదని కూడా ఆమె అన్నారు. వాజ్‌పేయీ ఆప్త మిత్రుడు అప్పా ఘటాటే అయితే వీళ్ళ అనుబంధాన్ని ప్రేమ అని పిలవాలా లేదా స్నేహం అని పిలవాలా తెలీదన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!