Advertisement
అగ్ర హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ఇప్పటికే చాలా సినిమాలు చేశారు పైగా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సినిమాలు చేసి అందర్నీ బాగా ఆకట్టుకున్నారు బాలకృష్ణ. అదే విధంగా అతి లోక సుందరి శ్రీ దేవి గురించి కూడా మనం పరిచయం చెయ్యక్కర్లేదు. బాల నటిగా శ్రీదేవి సినిమాల్లోకి వచ్చి తర్వాత అగ్ర హీరోలతో కలిసి శ్రీదేవి ఎన్నో చిత్రాల్లో నటించింది.
Advertisement
శ్రీదేవి కూడా చాలా మంది సీనియర్ నటులతో పని చేసింది అయితే బాలకృష్ణ పెద్ద హీరో శ్రీదేవి కూడా ఒక పెద్ద హీరోయినే అయినా కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి నటించలేదు..? దాని వెనుక రీసన్ ఏంటి అనేది చూసేద్దాం. 1978లో పదహారేళ్ళ వయసులో హీరోయిన్ గా కనిపించింది శ్రీదేవి. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు చేసింది.
Advertisement
బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణ 1974 నుండి బాల నటుడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. తర్వాత మంగమ్మగారి మనవడు భలేదొంగ ఇలా చాలా సినిమాలు చేసాడు. శ్రీదేవి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి పెద్ద పెద్ద హీరోలతో నటించింది అయినా బాలకృష్ణతో నటించలేదు దాని వెనుక కారణం ఏమిటంటే… రాఘవేంద్రరావు 1987లో బాలకృష్ణ శ్రీదేవితో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.
ఆ సినిమాని అనౌన్స్ చేశారు కూడా ఆ మూవీ పేరే సామ్రాట. కానీ ఆ సినిమా రాలేదు. 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమాని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తీసుకురావాలనుకున్నారు. అయితే అప్పుడు శ్రీదేవి బాగా బిజీగా ఉన్నారు దీంతో సినిమా అవలేదు ఇలా బాలకృష్ణ పక్కన శ్రీదేవి నటించడం కుదరలేదు వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా సినిమాలు చేయకపోయినా అనురాగ దేవత, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు వంటి సినిమాల్లో ఒకే ఫ్రేమ్లో కనపడ్డారు.
Also read:
ఆదిపురుష్ సినిమా చూసేటప్పుడు ఈ నియమాలు పాటించాలట..!
ఆ రోజు చెప్పులు ఎన్టీఆర్ మీద కాదు లక్ష్మీపార్వతి మీద విసిరారు.. అసలు ఏం అయ్యింది..?
పుష్ప సినిమాలో.. సుకుమార్ ఇంత చిన్న ఫన్నీ లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు..?