Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది వారసులు ఉన్నారు. హీరోలు, దర్శకులు మరియు నిర్మాతల తనయులు కూడా ఇప్పుడు హీరోలు అవుతున్నారు. అయితే అందులో కొందరు ఫుల్ సక్సెస్ తో రన్ అవుతుంటే, కొందరు మాత్రం వెనకంజలోనే ఉంటున్నారు. ఇందులో ముఖ్యంగా అక్కినేని మూలతరం అఖిల్ అక్కినేని. అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి.
Advertisement
ఆకట్టుకునే అందం, ఫిజిక్, నటన ఉన్న కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కినేని అఖిల్ చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అఖిల్ హిట్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అటు ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవరు ఆడపిల్లలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య తన డాటర్స్ ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తుంది.
Advertisement
అయితే, బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తుంది. మరి ముఖ్యంగా నారా బ్రాహ్మిణికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని, ఆమె ఫోకస్ అంత బిజినెస్ వైపే ఉందని తెలుస్తుంది. అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట. తన పాత్ర తెరవెనుక ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటుందట. ఈ క్రమంలోనే బాలయ్య కూతురు ఇండస్ట్రీలో తెరపై కనిపించలేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే బాలయ్య పెంపకం సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.