Advertisement
బిస్కెట్లు ఇష్టపడని వారిని మనం చాలా అరుదుగా చూస్తాము. మనం ఎవరి ఇంటికి వెళ్లినా, ఫలహారాలుగా బిస్కెట్లు మరియు టీతో స్వాగతం పలుకుతారు. బిస్కెట్లకు భారీ మార్కెట్ ఉంది మరియు ప్రతి రకానికి దాని ప్రత్యేక డిజైన్ ఉంటుంది. అయితే బిస్కట్స్ అన్నిటికి కామన్ గా కనిపించేది వాటికి ఉండే రంధ్రాలు. చాలా రకాల బిస్కట్లకు ఈ రంధ్రాలు ఉండడం చూస్తూనే ఉంటాం. బిస్కెట్ తయారీదారులు రంధ్రాలతో బిస్కెట్‌లను రూపొందించడానికి గల ప్రధాన కారణం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Advertisement
బిస్కెట్లలో ఉండే రంధ్రాలను డాకర్ హోల్స్ అంటారు. మీరు వాటిని చాలా తీపి మరియు ఉప్పగా ఉండే బిస్కెట్‌లలో అలాగే బోర్బన్ వంటి క్రీమ్-నిండిన బిస్కెట్‌లలో గమనించి ఉంటారు. ఈ రంధ్రాలను వాటిని తయారు చేసే సమయంలోనే పెడుతుంటారు. ఈ రంధ్రాలు పెట్టడానికి పెద్ద కారణమే ఉంది. బిస్కట్లను బేకింగ్ చేసే సమయంలో వాటిని ఉబ్బకుండా.. అలాగే బిస్కట్ మధ్య ప్రాంతంలో గాలి చొరబడి సరిగ్గా బేక్ అయ్యే విధంగా ఉండడం కోసమే రంధ్రాలను పెడుతుంటారు.
Advertisement
ఈ బిస్కట్లను తయారు చేసే ముందు మొదట పిండి, చక్కెర మరియు ఉప్పును షీట్ లాంటి ట్రేలో వ్యాప్తి చేస్తారు, తర్వాత బేకింగ్ ప్రక్రియకు ముందు ఒక యంత్రం కింద ఉంచుతారు. ఈ మెషిన్ వాటికి హొల్స్ చేస్తుంది. అన్ని బిస్కట్లకు ఒకేలా రంధ్రాలు చేస్తుంది. దీని కారణంగా, బిస్కెట్ ప్రతి మూల నుండి ఒకేలా బేక్ అవుతుంది. ఫలితంగా అన్ని బిస్కెట్లు ఒకేలా ఉంటాయి. ఈ రంధ్రాలు లేకపోతే బిస్కెట్లు ఒక్కోసారి ఉబ్బిపోయి ఒక్కో బిస్కెట్ ఒక్కో సైజులో ఉంటుంది. అందుకే బిస్కెట్లకు రంధ్రాలు పెట్టడం అవసరం.
మరిన్ని..
Bhagavanth Kesari Dialogues in Telugu: భగవంత్ కేసరి డైలాగ్స్