Advertisement
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతీకారం కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ వై ఎస్ జగన్ పై మండిపడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసారని చెప్పడం గమనార్హం.
Advertisement
ఇవి కూడా చదవండి: అందరిముందు పాకిస్థాన్ అధ్యక్షుడిని కడిగిపారేసింది.. అసలు ఎవరు ఈ అమ్మాయి..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
ఇవి కూడా చదవండి: రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త తలనొప్పి ! ఇది కదయ్యా అభిమానం అంటే !
మంత్రి మల్లా రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇస్తూనే కామెంట్స్ చేసారు. ఆయనను అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ మోత్కుపల్లి నర్సింహులు మరింత ఆగ్రహంతో మాట్లాడారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఆ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ నిప్పులు చెరిగారు.
Advertisement
ఇవి కూడా చదవండి: AP CID అడిగిన పది ప్రశ్నలు ఇవేనా? చంద్రబాబు నాయుడికి ఎదురైన ఆ ప్రశ్నలు ఏంటంటే?
అసలు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యాలంటే 17A ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలని.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఎన్ తన ప్రజల కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారని.. అలాంటి వ్యక్తి కేవలం మూడు వందల కోట్ల కోసం ఆశపడతారా? అని ప్రశ్నించారు. అసలు ఆయనను అరెస్ట్ చేయించినందుకు సి ఎం జగన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నారు. ఆయన సిబిఎన్ అరెస్ట్ కు వ్యతిరేకం వ్యక్తం చేస్తూ చేపట్టిన దీక్షకు నాయకత్వం వహించారు. అయితే బిఆర్ఎస్ పెద్దలు మాత్రం మౌనం వహిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పొందడం కోసమే బిఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. గతంలో టీడీపీ హయాంలో పని చేసిన నేతలు ఇలా స్పందిస్తూ ఆయనపట్ల తమకి ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.