Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి ప్రజలలో ఆసక్తి నెలకొంది. చంద్రబాబు నాయుడుకు ఎందుకు బెయిల్ రాలేదు? అన్న డౌట్ చాలా మందిలో ఉంది. అసలు చంద్రబాబు నాయుడికి చాలా రోజుల క్రితమే హై కోర్ట్ లో బెయిల్ కోసం అప్లై చేసుకున్నా బెయిల్ ఎందుకు రాలేదో ఇపుడు చూద్దాం. ఈ విషయమై అడ్వకేట్ హనుమంత్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
Advertisement
ఆయన ఏమి చెప్పారో ఈ ఆర్టికల్ లో చూడండి. ఏ కేసులో అయినా బెయిల్ రావాలి అంటే విచారణ జరగాలి. నిందితులను విచారణ చేసి ఆ తరువాత కాల్ షీట్ వేస్తారు. దాన్ని బట్టే బెయిల్ వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. అయితే.. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ 1 గా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఆయనను తప్పనిసరిగా విచారించాల్సి ఉంటుంది. ఆయనను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
అయితే.. ఆయనను కస్టడీలోకి తీసుకోకుండా, విచారణ జరపకుండా టీడీపీ వర్గాలు రకరకాల పిటిషన్లు వేసి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. దాని వలన కస్టడీ లేట్ అవుతోందని.. ఒకవేళ టీడీపీ ప్రయత్నాలు విఫలం అయితే ఆయన కచ్చితంగా కస్టడీకి వెళ్లాల్సి ఉంటుందని.. అప్పుడు విచారణ ఆలస్యం అవుతుందని అన్నారు. దీనివలన ఈ కేసు మరింత లేట్ అయ్యి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేట్ గానే ఉంటాయి. దీని వలన టీడీపీ వారికే నష్టమని అడ్వొకేట్ హనుమంత్ ప్రసాద్ అన్నారు. ఎంత త్వరగా ఎంక్వయిరీ పూర్తి చేసుకుంటే అంత త్వరగ బయటకి రావచ్చని.. నేరం నిరూపితం అవ్వాలనే లేదని.. బెయిల్ పై బయటకి రావచ్చని ఆయన అన్నారు.
Watch Video: