Advertisement
ఇటీవల తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు 7691 ఖైదీ నంబర్ ను ఇచ్చారు. అయితే.. చంద్రబాబు నాయుడుకు ఈ నెంబర్ ఎలా ఇచ్చారు? అరెస్ట్ చేసిన తరువాత జైలులో ఉండే ఖైదీలకు ఎలాంటి నంబర్స్ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
జైలులో ఉండే ఖైదీలు నాలుగు రకాలుగా ఉంటారు. వారు కన్విక్టెడ్ ప్రిజనర్స్, డిటైనీ ప్రిజనర్స్, రిమాండ్ ప్రిజనర్స్, విమెన్ ప్రిజనర్స్. వీరిలో కన్విక్టడ్ ప్రిజనర్స్ అంటే ఏదైనా నేరం చేసి, రుజువు కాబట్టి అరెస్ట్ అయ్యిన ఖైదీలని అర్ధం. రిమాండ్ ఖైదీలు అంటే అరెస్ట్ అయ్యి విచారణ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు. డిటైనీ ప్రిజనర్స్ అంటే నేరారోపణ కాకుండా ఇతర కారణాల వలన అరెస్ట్ అయిన వారు. అంటే కలెక్టర్, ఆర్‌డిఓ లేదా తహసీల్దార్ చే అరెస్ట్ చేయించబడినవారు. ఇక మహిళలకు విమెన్ ప్రిజనర్స్ అనే ప్రత్యేక క్యాటగిరి ఉంది.
Advertisement
ప్రతి క్యాటగిరి ఖైదీకి వారి క్యాటగిరి ప్రకారం వారిని జైలులో చేర్చిన క్రమ సంఖ్యను ఇస్తుంటారు. ఇక ప్రత్యేక ఖైదీలకు కూడా ప్రత్యేక నెంబర్ ఉంటుంది. కన్విక్టడ్ ఖైదీలకు సి.పి. తో కూడిన నంబర్లు ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ క్యాటగిరికి సంబంధిచిన ప్రత్యేక ఖైదీల సీరియల్ నెంబర్ ప్రకారం చంద్రబాబు నాయుడుకు 7691 నెంబర్ ను ఇచ్చారు. ఇది యాదృచ్చికంగా జరిగినదే తప్ప ఈ నెంబర్ కు వేరే ప్రత్యేకత ఏమీ లేదు.
మరిన్ని..