Advertisement
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడం గురించి చంద్రబాబు నాయుడు గత వారమే చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు టీడీపీ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర పార్టీ బిజెపి నిశితంగా గమనిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన కూడా కీలకంగా మారింది. జమిలి ఎన్నికల వేళ జరుగుతున్న ఈ మార్పులు ఏపీ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో అన్న సందేహాలు ప్రజలలో నెలకొని ఉన్నాయి.
Advertisement
చంద్రబాబు నాయుడుని గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాలలో RK ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రోజు రాత్రి చంద్రబాబు నాయుడు బస చేసారు. అదే సమయంలో అక్కడకి చేరుకున్న నంద్యాల పోలీసులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి.. ఆయనను అరెస్ట్ చేసారు. ఆ తరువాత సిఐడి భద్రతతో విజయవాడ జైలుకు తరలిస్తామని ఆయనకీ పోలీసులు వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
చంద్రబాబు నాయుడుని నాన్ బెయిలబుల్ కేసుపై అరెస్ట్ చేసారు. ఇప్పటివరకు ఆయనకు బెయిల్ రాలేదు. బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హై కోర్ట్ లో అప్లై చేసుకున్న సంగతి విదితమే. అయితే.. ఆయనను శుక్రవారమే ఎందుకు అరెస్ట్ చేశారు? అన్న విషయమై నెటిజన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి సమయంలో అరెస్ట్ చేస్తే.. శని, ఆది వారాలు కోర్టుకు సెలవు రోజులు. అంటే ఆయనకు సోమవారం వచ్చే వరకు బెయిల్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఇలా శుక్రవారం అరెస్ట్ చేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి.
మరిన్ని..