Advertisement
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది కేవలం సినిమాలకి క్రికెట్ కి మాత్రమే. ఈ రెండిటికీ మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ లో రెండిటికి అంత పోటీ ఉంది క్రికెట్ గురించి వేరే చెప్పక్కర్లేదు ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉందంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత ఎవరు గెలుస్తారు అని ఆసక్తిగా మ్యాచ్ చూస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా గమనించారా..? క్రికెట్ లో అన్ని దేశాలు ఆడుతూ ఉంటాయి. కానీ చైనా మాత్రం క్రికెట్ ఆడదు ఎందుకు..? చైనా క్రికెట్ కి దూరంగా ఉంటుంది. దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
సాధారణంగా ఒలింపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్ లో చైనా ఎప్పుడూ ముందుంటుంది ఒలింపిక్స్ లో ఎంతో మంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ సాధించారు కానీ క్రికెట్ అనేది ఒలింపిక్ లో భాగం కాదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువ దృష్టి పెట్టదు. అంతేకాకుండా చైనా క్రికెట్ ఆడక పోవడానికి ఇంకో కారణం ఉంది. చైనా ఎప్పుడు బ్రిటిష్ పాలనలో లేదు క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒక సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. చైనాలో ఎక్కువగా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటారు ఈ రెండు ఆటలు ఒలింపిక్స్ లోకి వస్తాయి.
Advertisement
Also read:
క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్స్ కిందకి రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల మాత్రమే క్రికెట్లో పాల్గొంటాయి. అయితే చైనాకి క్రికెట్ టీం ఉంది 2009లో ఏసీసీ ట్రాఫిక్ ఛాలెంజ్ లో ఈ జట్టు పాల్గొంది కానీ మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది తర్వాత మైనమార్ తో జరిగిన మ్యాచ్లో మొదటి ఇంటర్నేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది ఐసిసి చైనాలో కూడా క్రికెట్ ని ప్రమోట్ చేస్తున్నారు. 2019లో జరిగిన T20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొంది విజయాన్ని సాధించింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!