Advertisement
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి.
Advertisement
ప్రస్తుత కాలంలో క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. అయితే చైనా మాత్రం క్రికెట్ పై పెద్ద ఆసక్తి చూపదు. క్రికెట్ ఆడడానికి చైనా ఎందుకు ఆసక్తి చూపదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు చైనా కి కూడా క్రికెట్ టీం ఉండేది. 2009లో పిసిసి ట్రోఫీ ఛాలెంజ్ లో పాల్గొని మొదట మ్యాచులలో ఓడిపోయింది.
Advertisement
ఆ తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా 2019లో జరిగిన టి – 20 ఉమెన్స్ ఈస్ట్ ఏసియా కప్ టోర్నమెంట్ లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది. అయితే చైనా పాపులేషన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీనివల్ల అందరూ చదువుపై దృష్టి పెట్టకుండా ఆటలపై కూడా దృష్టి పెట్టేవారు. అప్పట్లో ఒలంపిక్స్ లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ఆటలపైనే చైనా ఎక్కువగా ఆసక్తి చూపేది. వాటిలో చైనా నుండి గోల్డ్ మెడల్స్ కొడితే ప్రపంచం మొత్తం చైనా వైపు చూస్తుందని అనుకున్నారు.
ఆ కాలంలో ఒలంపిక్స్ లో క్రికెట్ లేదు. అలాగే ఆ కాలంలో క్రికెట్ అంత ప్రాముఖ్యమైన ఆట కూడా కాదు. అందుకే వాళ్ళు క్రికెట్ పై ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఒలంపిక్స్ లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ఆటలపైనే ఆసక్తి చూపారు. ఒలంపిక్స్ లో ఎంతో మంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ కూడా సాధించారు. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్స్ కాకపోవడం.. అలాగే ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ లో పాల్గొనడం ముఖ్య కారణంగా తెలుస్తోంది.
Read also: అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?