Advertisement
మనలో చాలామంది చిప్స్ ప్యాకెట్లను కొనుక్కొని తింటుంటాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ రకరకాల చిప్స్ ని ఎంతో ఇష్టపడి తింటుంటారు. చిప్స్ ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి. అయితే మీలో ఎవరికైనా చిప్స్ ప్యాకెట్లలో గాలి ఎందుకు నింపుతారో ఎప్పుడైనా ఆలోచించారా? చిప్స్ ప్యాకెట్లు చూడడానికి ఎంతో పెద్దవిగా కనిపించినప్పటికీ అందులో 70% గ్యాస్ ఉంటుందట. అలా గ్యాస్ నింపడానికి కూడా ఓ ప్రత్యేకమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది చిప్స్ ప్యాకెట్ లో గ్యాస్ ఎందుకు ఉంటుంది అని అడిగితే చిప్స్ విరిగిపోకుండా అని సమాధానం చెబుతారు.
Advertisement
Advertisement
కానీ అది వాస్తవం కాదు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే ఆక్సిజన్ ను రియాక్టివ్ వాయువుగా పరిగణిస్తారు. ఇది ఏ కణంలో అయినా త్వరగా కరిగిపోతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ కారణంగా బ్యాక్టీరియా మొదలైన సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల మనం తినే ఆహార పదార్థాలు ఓపెన్ ప్లేస్ లో ఉంచినట్లయితే అవి త్వరగా చెడిపోతాయి. కాబట్టి చిప్స్ ప్యాకెట్లలో తక్కువ రేయాక్టివ్ కలిగిన నైట్రోజన్ వాయువును నింపుతారట. అంతేకాదు నైట్రోజన్ వాయువుని నింపడానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. నైట్రోజన్ రంగు, రుచి, వాసన లేనిది. ఇది తక్కువ రియాక్టివ్ గా ఉంటుంది.
అందుకే చిప్స్ ప్యాకెట్ లలో నైట్రోజన్ గ్యాస్ ని నింపుతారు. ఇలా చేయడం వల్ల చీప్స్ ఎక్కువ కాలం క్రిస్పీగా ఉంటాయి. అంతేకాక నైట్రోజన్ గ్యాస్ ని నింపిన చిప్స్ ప్యాకెట్లను రవాణా చేయడం కూడా చాలా సులభతరం. కానీ కంపెనీలు కావాలనే ఇలా చేస్తున్నాయేమో, మనకి సగం వరకు మాత్రమే చిప్స్ ఇచ్చి మనల్ని మోసగిస్తున్నాయేమోనని అందరూ అనుకుంటారు. దీనికి అసలైన కారణం ఇదే. అయితే వీటిని అధికంగా తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు అధికమవుతాయి. పిల్లలకి వీటిని తినిపించడం తగ్గిస్తే వారి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Read also: మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగిఉంది ఎక్కడో గుర్తించండి..?