Advertisement
ప్రతిరోజు మనం పూజ చేస్తూ ఉంటాం. అలాగే ఆలయాలకి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన రోజుల్లో కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. హిందువులు ఏ కార్యం తలపెట్టినా, దేవాలయాల్ని సందర్శించినా, పూజలు చేసినా కొబ్బరికాయ కొడతారు. కొందరు అయితే వారంలో ఇష్ట దైవాన్ని పూజించిన రోజు తప్పకుండా కొబ్బరికాయ కొడతారు. శుభకార్యాల్లో అయితే కొబ్బరికాయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొబ్బరికాయలు ఎందుకు అంత పవిత్రమైనవి..? పూజ చేసేటప్పుడు ఎందుకు కొబ్బరికాయలు కొట్టాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది చూద్దాం.
Advertisement
కొబ్బరికాయలో మీద ఉన్న భాగాన్ని మన అహంతో పోల్చుతారు లోపల తెల్ల భాగాన్ని స్వచ్ఛమైన మనసుకి చిహ్నంగా భావిస్తారు. అందుకని కొబ్బరికాయని పగలగొట్టడం అంటే మన అహాన్ని వదిలి స్వచ్ఛమైన మనసుతో దైవాన్ని పూజించడం అని అర్థమట. అందుకని కొబ్బరికాయని కొడతారు. శ్రీహరికి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటే. కొబ్బరికాయని కొట్టిన నైవేద్యం పెడతారు. కొబ్బరికాయకి ఉండే మూడు కళ్ళు బ్రహ్మా, విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు.
Advertisement
Also read:
కనుక కొబ్బరికాయ పవిత్రంగా మారింది. అందుకే కొబ్బరికాయని పూజల్లో వాడడం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొట్టడం వంటివి చేస్తారు. కొబ్బరికాయతో పాటుగా అరటి పండ్లను కూడా పవిత్రంగా భావిస్తారు. వీటిని నైవేద్యం పెడతారు. వాస్తవానికి కొబ్బరి చెట్లు, అరటి చెట్లు విత్తనాలు లేకుండా పెరుగుతాయి. అందుకని వీటిని పవిత్రంగా భావించి నైవేద్యం కోసం ఉపయోగించడం జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టడం వలన నెగిటివ్ నుంచి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి