Advertisement
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ లో నోవటాల్ లో ప్లాన్ చేశారు. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఎన్నో మంచి రికార్డ్ కలెక్షన్లతో దేవర సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అయితే దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు ఇవే.
Advertisement
ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ తో ఎంతో హైప్ వచ్చింది. దాంతో ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ సమయంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించడమే చిత్ర బృందం చేసిన తప్పు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని సినీ బృందం అంచనా వేయలేదు, ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ రావడం జరిగింది.
Advertisement
Also read:
దాంతో పాటుగా పాసులు లేకపోయినా 30 వేలకు పైగా అభిమానులు హాజరయ్యారు. దాదాపు 5 సంవత్సరాలు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతోంది. సోషల్ మీడియాలో కూడా దేవరా సినిమాకు చాలా హైప్ వచ్చింది. ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేలాది మంది అభిమానులు రావడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు హాజరైతే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని ఈవెంట్ జరిగే పరిస్థితులు కనబడడం లేదని రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!