Advertisement
“స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమా గురించి తెలియని వారుండరు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన “స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమాను సినీ ప్రేమికులు విపరీతంగా ఆరాధించారు. ఈ సినిమా బాక్సాఫీస్ లో రికార్డులను సాధించి రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15 వేల కోట్ల) ఆదాయాన్ని సంపాదించింది.
Advertisement
Also Read: భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్ళే…
కరోనా ప్రభావంతో దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఈ సినిమా సాధించిన విజయం కొత్త ఆశను కలిగించింది. కానీ, చైనాలో మాత్రం ఈ సినిమాను నిషేధించారు. చైనా సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఉండే వాటిని చైనా ఇటీవల నిషేధిస్తుంది. కానీ, స్పైడర్ మ్యాన్ సినిమాలో చైనా విలువలను భంగపరిచే విధంగా ఏమీ లేదు. ఈ సినిమాలో కనీసం చైనా ప్రస్తావన కూడా లేదు.
Advertisement
చైనా స్పైడర్ మ్యాన్ ను ఎందుకు నిషేధించింది?
“భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలను చైనాలో విజయవంతం, అయితే అది అమెరికా బాక్సాఫీస్ ఆదాయాలను రెట్టింపు చేస్తుంది” అని వర్జినియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయాన్ కోకస్ అన్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు చైనాలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారు. ఇక్కడ హాలీవుడ్ గ్లామర్ కంటే కూడా పెట్టుబడిదారుల నుంచి కూడా చాలామంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలన్నారు.
” ఈ సినిమాల ద్వారా అమెరికా ప్రతిష్టను శక్తివంతంగా గర్వంగా చూపించడాన్ని చైనా సహించలేదు” ”రెండోది చైనా ప్రభుత్వ ఆదర్శాలను ప్రచారం చేసే చైనా సినిమాల కోసం మరింత స్పేస్ కావాలి”. ” ఎవరైనా రచయిత చైనాలోని కాన్సన్ట్రేషన్ శిబిరాల గురించి చెప్పాలనుకుంటే, అలాంటి వాటిని విడుదల చేయడం అరుదుగా మారుతుంది. దీంతో, అలాంటి సినిమాలు ఎప్పటికీ నిర్మించరు కూడా” అని కోకస్ అన్నారు.
Also read: భర్త చనిపోయిన రెండవ రోజే మీనా అలాంటి నిర్ణయం తీసుకున్నారా ?