Advertisement
ఉదయ్ కిరణ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ కెరియర్ మొదట్లోనే మంచి హిట్స్ ని కొట్టేశాడు. మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి కూడా అల్లుడు చేసుకోవాలని అనుకున్నారు. కానీ దురదృష్టం ఉదయ్ కిరణ్ లైఫ్ లో అన్నీ ఫెయిల్యూర్స్ ఏ ఎదురయ్యాయి. ఆఖరికి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.
Advertisement
తాజాగా షాకింగ్ విషయాలు కొన్ని వెలుగు లోకి వచ్చాయి. చిరంజీవి కూతురు సుస్మిత తో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ ఈ విషయం పై కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పారు. కెరీర్ పరంగా ఉదయ్ కిరణ్ కొని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అయితే ఉదయ్ కిరణ్ మరణం మాత్రం ఇప్పటికీ కూడా అభిమానుల్ని బాధపెడుతూనే ఉంది. ఉదయ్ కిరణ్ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అని అనిపించిందని భరద్వాజ్ అన్నారు.
Advertisement
నువ్వు నేను సినిమాని తరుణ్ మిస్ చేసుకుంటే ఉదయ్ కిరణ్ కి ఆ సినిమా చేసే అవకాశం వచ్చిందని భరద్వాజ్ అన్నారు. రెండో సినిమాతో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి కూతుళ్ళని ఇష్టమైన హీరో ఎవరని అడిగితే ఉదయ్ కిరణ్ పేరు చెప్పారని సుస్మిత చెప్పినట్లు చెప్పారు. ఇంద్ర మూవీ శత దినోత్సవ వేడుకలకు ఉదయ్ కిరణ్ రావడానికి కారణం పెళ్లి ఫిక్స్ అవ్వడమేనట.
ఉదయ్ కిరణ్ వల్లనే మనసంతా నువ్వే సినిమాలో కొన్ని పొరపాట్లు వున్నా సినిమా హిట్ అయిందని భరద్వాజ్ అన్నారు. ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి ముందు జర్నలిస్టులకి ఉదయ్ కిరణ్ పార్టీ ఇచ్చాడని భరద్వాజ్ అన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని అన్నారు. మెగా ఫ్యామిలీ ఏ ఉదయ్ కిరణ్ ని తొక్కేసిందని అన్నారు. ఉదయ్ కిరణ్ సక్సెస్ ని తీసుకున్న విధంగా ఫెయిల్యూర్ ని తీసుకోలేదని అందుకే ఆయన ఫెయిల్ అయ్యారని భరద్వాజ్ అన్నారు.
Also read:
Samajavaragamana Review: సామజవరగమన స్టోరీ, రివ్యూ & రేటింగ్..!
రైలు మీద ఎందుకు ఆకుపచ్చ, పసుపు గీతలు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?