Advertisement
కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా, మిగతా జంతువుల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. కొన్ని తెలివైన కుక్కలు యజమాని ఏం చెబితే అది మాత్రమే చేస్తాయి. కొన్ని కుక్కల్లో చాలా బ్రీడ్స్ కూడా ఉంటాయి. కొన్ని పొట్టిగా ఉంటే కొన్ని పొడుగ్గా ఉంటాయి.
Advertisement
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలకు యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ కుక్కలు కదులుతున్న వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. అసలు అది ఎందుకు అలా వెంబడిస్తాయో ఇప్పుడు చూద్దాం. కుక్కలు పెంపుడు జంతువులు. వారి యజమానులు తమ తమ వాహనాలను తీసుకొని, బయటకు వెళితే, ఎంతో ప్రేమ చూపిస్తూ, వారి వెంబడి పరిగెత్తుతాయి కుక్కలు. వారి యజమానులు క్షేమంగా రావాలని, సాంకేతం ఇస్తూ, ఆ కుక్కలు పరిగెత్తుతాయట.
Advertisement
ఇక వీధి కుక్కలు అయితే, ఏదైనా వెహికిల్ ఫాస్ట్ గా లేదా, అధిక ధ్వని చేస్తూ వెళితే, వారి వెనుక పరుగెడుతాయి. అలాంటి శబ్దాలు, స్పీడ్ గా వెళ్లే వాహనదారులను దొంగలుగా భావించి, వారిని పట్టుకునేందుకు, కుక్కలు వెంబడిస్తాయి. ఇలాంటి సమయంలో, ఆ వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుక్కలు ఉన్నచోట, వాహనాలు నెమ్మదిగా వెళితే చాలా మంచిది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?