Advertisement
అంతక్రియల్లో కుండలో ఉన్న నీళ్లు పోసి రంధ్రాలు పెడతారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు రంధ్రాలు పెడతారు అనే ప్రశ్న అందరి కి ఎదురవుతుంది. మరి ఎందుకు ఆ కుండను పలగొడతారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. ఇలా చేయడం వెనుక పూర్వీకుల ముందు చూపు ఉంటుంది. చనిపోయిన వ్యక్తులు పిల్లలైనా, పెద్దలైనా సరే వాళ్లను పితృదేవతలుగా భావిస్తారు. ప్రదక్షిణం చేయడం అంటే వారిని దేవతలుగా భావించి, భక్తి గౌరవాలు వెల్లడించడం.
Advertisement
Also read: SR ఎన్టీఆర్ కు ఒక్క హైదరబాద్ లోనే ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయో తెలుసా..?
Advertisement
స్మశానంలో మాత్రమే కాకుండా ఇంటి వద్ద శవాన్ని తీసుకువెళ్లే ముందు బంధువులు, సన్నిహితులు, అక్కడికి వచ్చిన వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడు పూలు గాని , పూలమాలలు గాని వేసి భక్తి భావాలు ప్రదర్శిస్తారు. చితి చుట్టూ కుండతో ప్రదక్షిణ చేసి కుండకు రంధ్రాలు, చేసి నీరు వదలడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మన జీవితం కూడా చిల్లుల కుండ అనే తాత్విక సందేశం ఇస్తారు.
అలాగే దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. మన స్మశానాలు ఎక్కువగా చెత్తచెదారంతో ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని చోట్ల దట్టమైన పొదలు, చెట్లు ఉండటంతో మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల స్మశానాల్లో గడ్డివాములు, పశువుల పాకలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కపాల మోక్షం కలిగిన వెంటనే వచ్చిన వాళ్లు ఇళ్లకు వెళ్తారు. అప్పుడు మంటలు విస్తరిస్తే అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చితి చుట్టూ నీరు జల్లడంతో అగ్ని ప్రమాదం కట్టడి చేయవచ్చు. అందుకే పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారని అంటూ ఉంటారు.
Also Read: “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?