Advertisement
ప్రతిరోజు మనం కచ్చితంగా వంటల్లో ఉల్లిపాయల్ని వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ వుంటారు. ఎన్నో రకాల సమస్యలను ఉల్లి దూరం చేయగలదు. ఉల్లిపాయని తీసుకోవడం వలన వివిధ రకాల అనారోగ్య సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. అయితే ఉల్లిపాయల్ని కోయడమే నిజంగా పెద్ద యుద్ధం.
Advertisement
ఉల్లిపాయల్ని కోస్తున్నప్పుడు కచ్చితంగా కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. మంట పుడుతుంది. అయితే మరి ఉల్లిపాయల్ని కోసేటప్పుడు ఎందుకు కన్నీళ్లు వస్తాయి..? దాని వెనుక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ముఖ్య కారణం ఉల్లిపాయలో ఉండే రసాయనం. దీనిని సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ అని అంటారు. ఉల్లిపాయల్ని కోసేటప్పుడు అందులో ఉండే ఈ రసాయనం కళ్ళల్లో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది.
Advertisement
దీని కారణంగా కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని కాసేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత కోస్తే కన్నీళ్లు రావు. ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కొంచెం పదునైన కత్తిని ఉపయోగిస్తే కూడా కళ్ళంట నీళ్లు రావు. అటు ఇటు ఉల్లిపాయని కోసేసి, 15 నుండి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టారంటే ఉల్లిపాయలో ఉండే సల్ఫ్యూరిక్ సమ్మేళనం బయటికి వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు కట్ చేయడం మొదలుపెడితే కన్నీళ్లు రావు.
Also read: