Advertisement
పరమశివుడుని ఆరాధిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మహాశివుడిని ప్రతి సోమవారం ప్రత్యేకించి పూజ చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది భక్తులు హర హర మహాదేవా అని స్వామి వారిని నమస్కరిస్తూ ఉంటారు. వారణాసి లో ఎక్కువగా ఇది మనకి వినపడుతుంది. ఈ మంత్రంతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అలానే ఇది చదవడం వలన ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే చాలా మందికి ఎందుకు ఇలా చేస్తారు అనే దాని వెనుక అర్థం తెలీదు. హర హర మహాదేవ అనే పేరుతో స్వామి వారిని ఎందుకు పూజించాలి..? దాని వెనక అర్థం ఏంటి అనే విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
Advertisement
Advertisement
హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే సృష్టి లయకారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తూ ఉంటాము కానీ శైవులు శివుడుని మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు కనుక దేవుళ్ళకే దేవుడుగా పరమేశ్వరుడిని పూజిస్తారు. స్వామివారిని పూజించేటప్పుడు హరహర మహాదేవ అనే మంత్రంతో స్మరించడానికి గల కారణం ఏంటంటే హర అంటే పాపాలని మొత్తం, హర అంటే తీసుకెళ్లేవాడు, మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడు, హర హర మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడైన పరమేశ్వరుడు మన పాపాల్ని మొత్తం తీసుకెళ్తారని దీని వెనుక అర్థం.
అందుకే పరమేశ్వరుడి ఆలయాలకి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో శివుడిని హర హర మహాదేవ అని పిలిచి నమస్కరించుకుంటూ ఉంటారు ఇలా చేయడం వలన పాపాలన్నీ కూడా పోతాయని భక్తుల నమ్మకం. ఇదే విషయాన్ని పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి శివాలయానికి వెళ్ళిన లేదంటే శివుడిని మీరు ఆరాధించేటప్పుడు అయినా సరే హర హర మహాదేవ అని చెప్పుకోవడం మంచిది. దీని వలన పాపాలన్నీ కూడా పోతాయి సంతోషంగా ఏ కష్టం లేకుండా ఉండవచ్చు ఆనందంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!