Advertisement
ప్రస్తుత కాలంలో బట్టతల చాలా కమాన్ అయిపోయింది. టెన్షన్, బిజీ లైఫ్ వల్ల బట్టతల వస్తుంది. అయితే బట్టతల వంశపారపర్యంగా వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అయితే వాస్తవం దానికంటే మరింత సంక్లిష్టంగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల గురించి 52,000 మంది పురుషులపై తాము అధ్యయనం చేశామని, బ్రిటిష్ పరిశోధకుల బృందం తెలిపింది. ఎక్స్ క్రోమోసోమ్ లో లోపాలే బట్టతలకు 40% కారణము ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. 287 మందిలో జుట్టు ఊడిపోవడానికి జన్యుపరమైన సమస్యలు కూడా ఒక కారణమని ఈ అధ్యాయంలో గుర్తించారు. తల్లి నుంచి బలమైన జన్యువులు పిల్లలకు రావడం నిజమే అయినప్పటికీ కేవలం ఒక్క జన్యువే బట్టతలకు కారణం కాదు అని కరోలిన్ గోహ్ చెప్పారు. ఒకటికి మించిన జన్యువుల వల్ల బట్టతల వస్తుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
బట్టతలకు కారణమయ్యే జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వస్తాయని వెల్లడించారు. రోజు తలస్నానం చేస్తే, క్యాప్ లు ఎక్కువ సేపు పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలామంది నమ్ముతుంటారు. జుట్టు ఊడిపోవడానికి ఇది ఒక కారణం అని కొందరు చెబుతూ ఉంటారు. కానీ జుట్టు ఊడిపోవడానికి ఇవేవీ కారణం కాదని డెర్మటాలజిస్ట్ గోహ్ చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే పురుషుల మాదిరిగా టెస్టోస్టిరాన్ మహిళలకు ఉండదు. దీనిని సమతుల్యం చేసేందుకు అత్యధిక మొత్తంలో ఈస్ట్రోజన్ ఉండడమే ఇందుకు కారణం. సాధారణంగా బట్టతలను నిరోధించడానికి ప్రస్తుతం క్లినికల్ గా నిరూపితమైన రెండు పరిష్కారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మీనోక్సిడిల్
లోషన్ల, ఫోమ్ ల రూపంలో అమ్మే దీనిని నేరుగా తలభాగానికి అప్లై చేసుకోవచ్చు. మీనోక్సిడిల్ కు నోటి ద్వారా వేసుకునే క్యాప్సూల్స్ ను తక్కువ డోస్ తీసుకోవడం కొత్తగా హెయిర్ గ్రోత్ వచ్చినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఫినాస్టెరాయిడ్
ఈ ఔషధాన్ని నోటితో తీసుకోవచ్చు. దీనిని మొదట ప్రోస్టేట్ పెరుగుదలకు వాడారు. ప్రస్తుతం దీనిని జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..?