Advertisement
పూర్వకాలంలో రాజులు, రాణిల వ్యవస్థ ఉండేది. కాలక్రమేనా అది అంతరించిపోయింది. రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఎలక్షన్లు వచ్చాయి. తమకు ఇష్టమైన వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకుంటున్నారు ప్రజలు. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికీ రాజరిక వ్యవస్థ ఉంది. మరికొన్ని దేశాల్లో అందరిలాగే ఎన్నికల ద్వారా దేశ ప్రధాని, అధ్యక్షులను ఎన్నుకున్న, రాణులు, రాజులు, రాజకుమారులు ఉన్నారు. ఇలాంటి చరిత్ర ప్రస్తుతం బ్రిటన్ లో నడుస్తోంది. అక్కడ రాణి ఎలిజబెత్-2 ఉన్నారు. బంకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉంటారు.
Advertisement
Advertisement
అయితే ఈ బ్రిటన్ రాణి సంవత్సరంలో రెండు పుట్టినరోజులను నిర్వహించుకుంటుంది. ఎలిజబెత్-2 అసలు పుట్టిన తేదీ అయిన ఏప్రిల్ 21న కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుగుతాయి. కానీ రాణి అధికారిక పుట్టినరోజు వేడుకలు జూన్ నెలలో రెండో శనివారం నాడు నిర్వహిస్తారు. బ్రిటిష్ రాజ్యంలో ఇదొక ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ రాణి తన అసలు పుట్టినరోజును కుటుంబంతో కలిసి జరుపుకుంటుంది. ఆరోజు హైడ్ పార్కులో 41-గన్ సెల్యూట్, విండ్సర్ గ్రేట్ పార్కులు 21-గన్ సెల్యూట్, లండన్ టవర్ వద్ద 62- గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. రాజవంశస్తుల జన్మదిన వేడుకలను ఆ దేశంలో ‘ట్రూపింగ్ ఆఫ్ కలర్స్ పరేడ్’ పేరుతో ఒక గొప్ప వేడుకల నిర్వహిస్తారు.
బ్రిటిష్ చక్రవర్తుల అధికారిక పుట్టిన రోజులను పురస్కరించుకొని ఈ వేడుకను గత 260 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ రాజవంశీయుల అధికారిక జన్మదిన వేడుకలను వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం ఒక సాంప్రదాయం. అక్టోబర్ లో జన్మించిన బ్రిటన్ రాజు, కింగ్ జార్జ్-2 తో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయని నమ్ముతారు. అధికారిక పుట్టినరోజు వేడుకల పరేడ్ లో 1400 మందికి పైగా సైనికులు, 200 గుర్రాలు, 400 మంది మ్యూజిషియన్స్ పాల్గొంటారట.