Advertisement
మేఘాల్లో ఉండే నీరు ఒక్కసారిగా కిందికి ఎందుకు పడదు? చినుకులు రూపంలో వర్షం గానే ఎందుకు కురుస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం పడేందుకు కారణం మేఘాలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. భూమిపై ఉండే నీరే ఆవిరిగా మారి, పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి, తర్వాత వర్షం రూపంలో తిరిగి భూమిని చేరుతుంది. అయితే ముందు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
Advertisement
గాలి వేడెక్కినప్పుడు తేలికవుతుంది. తేలికైన గాలి దాని ప్రభావాన్ని బట్టి పైకి ప్రయాణిస్తుంది. పైన అదే గాలి చల్లబడ్డప్పుడు బరువెక్కుతుంది కాబట్టి కిందికి ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియే మేఘాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సూర్యుని వేడి వల్ల జలాశయాల్లో నీరు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి వేడి గాలులతో కలిసి పైకి ప్రయాణిస్తుంది. అంతేకాక వీటికి వాతావరణంలోనీ ధూళి కణాలు కూడా కలుస్తాయి. ఇలా పైకి చేరిన వేడిగాలి, నీటి ఆవిరి, దుమ్ము అక్కడ చల్లబడి మేఘంగా ఏర్పడుతుంది.
Advertisement
ఈ మేఘం లోని కోట్లాది నీటి ఆవిరి రేణువులు చల్లబడి నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీరు మేఘాలను బరువెక్కిస్తాయి. అలా బరువెక్కిన మేఘాలు నీటికి వర్షం గా కిందకి కురిపిస్తాయి. తక్కువ ఎత్తులో ఉన్న కులాయి నీరే ఓకే ధారగా నేల మీద పడదు.అలాంటిది మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తున ఉన్న మేఘాల నుంచి నీరు ఒకే ధారగా పడడాన్ని మనం ఊహించలేం. ఆకాశంలో మనకు కనిపించే మేఘాలు ఎత్తులో చాలా తేడాలు ఉంటుంది.
also read;
టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?