Advertisement
కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా, మిగతా జంతువుల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. అలాగే వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలకు యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ కుక్కలు కదులుతున్న వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. మనుషులను కుక్కలు గుర్తుపడతాయి సరే, కానీ వాహనాలను ఎలా గుర్తుపడతాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజమే, కుక్కలు వాహనాలను కూడా గుర్తుపడతాయి. ఏ దైనా వాహనం తమ ప్రాంతానికి చెందినది లేదా ఆ వాహనాన్ని తిరిగి గుర్తు పట్టుకోవాలని కుక్కలు భావించినట్లయితే వాటి టైర్ల పై అవి మూత్ర విసర్జన చేస్తాయి.
Advertisement
అలా మూత్ర విసర్జన చేసిన వాసనను గుర్తుపట్టడం ద్వారా సదరు వాహనాలు సురక్షితమైనవిగా కుక్కలు భావిస్తాయని జంతు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వాహనం కొత్తగా కనిపించిన లేదా సదరువాహనం తమ ప్రాంతానికి చెందినది కాదని కుక్కలు గుర్తించిన వెంటనే మొరగడం ప్రారంభిస్తాయి. కొత్తవారిని చూసినప్పుడు శునకాలు ఏ విధంగానైతే మొరుగుతాయో, కొత్త వాహనాలను చూసినప్పుడు కూడా వాటి వలన తమకు మరియు తమ ప్రాంతంలోని వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ముందుగానే ఊహించి సదరు వాహనాలను వెంబడించడం ప్రారంభిస్తాయి. కుక్కలపై శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం కుక్కలు కొన్నిసార్లు టైం పాస్ కోసం కూడా వాహనాలను వెంబడించే అవకాశం ఉంది. కుక్కలు ఒంటరిగా అనిపించినప్పుడు లేదా పోరాటం అనిపించినప్పుడు సమయం గడపడానికి వాహనాలను వెంబడిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Advertisement
ఇలా చేయడం వల్ల వాటికి నీరసం తొలగిపోయి, ఆనందంగా ఉంటాయని వారు అంటున్నారు. కుక్కలు వాహనాలను వెంబడించడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే, వాటి వాహనాలు చేసే పెద్ద శబ్దాలు నచ్చకపోవడమట. వాహనాలు పెద్ద శబ్దాలు చేస్తూ ప్రయాణిస్తుంటే, కుక్కలు ఆశబ్దాలకు భయపడతాయని, కాబట్టి ఈ భావం వలన కూడా కుక్కలు వాహనాలను వెంబడిస్తాయని చెబుతున్నారు. నిజానికి, శునకాల వినికిడి శక్తి చాలా గొప్పగా ఉంటుంది. మామూలు మనుషులు కూడా వినలేని శబ్దాలను కూడా కుక్కలు చాలా ఖచ్చితంగా వినగలవు. కాబట్టి, వాహనాలు చేసే విపరీత ధ్వని వాటికి నచ్చకపోవడం వల్ల కూడా అవి వాహనాలను వెంబడించే అవకాశం ఉండవచ్చు.