Advertisement
కుక్కలు.. పెంపుడు జంతువులు. విశ్వాసంలో దీనికి మించిన జంతువులు ఎక్కడ ఉండవు. కాబట్టి అందరూ కుక్కలు పెంచుకోడానికి ఇస్టపడతారు. ఇది ఇలా ఉండగా ఈ కుక్కలు మూత్ర విసర్జన చేసే పద్ధతే కాస్త వింతగా…విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ కార్ల టైర్లు… స్తంభాలు కనిపించిన… పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకి ఎత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
కుక్కల ప్రవర్తన నిపుణులు అధ్యయనం ప్రకారం…కుక్కలు స్తంభం, లేదా టైర్ల పై చేయడం ద్వారా తమ భూభాగాన్ని గుర్తిస్తాయి. ఇది దాని ఇతర సహచరులను( ఇతర కుక్కలను) సంప్రదించి ఒక సులువైన మార్గం కూడా. ఒక కుక్క స్తంభం లేదా టైర్ పై మూత్రవిసర్జన చేసినప్పుడు అవి ఒక సమాచారాన్ని పాస్ చేస్తాయి. అంటే ఈ వాసనతో ఆ కుక్క ఉన్నట్టు తెలియజేసే గుర్తు అన్నమాట. ఈ వాసనను చూసిన ఇతర కుక్కలు సైతం అక్కడ తమ ముద్రను కూడా వదిలి వెళతాయి. కుక్కలు క్షితిజసమాంతర ఉపరితలాల కంటే నిలువు ఉపరితలాల పైనే మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాయి.
Advertisement
టైరు లేదా పోల్ దిగువ భాగం కుక్క ముక్కును చేరుకునే విధంగా ఉంటుంది. దీంతో అవి ఇతర కుక్కల ముక్కు స్థాయిలో తమ గుర్తును (మూత్రం) వదిలేస్తాయి. అయితే కుక్క మూత్రం వాసన టైరు లో ఎక్కువ సేపు ఉంటుంది. అదే భూమి మీద అయితే చాలా తొందరగా వాసన పోతుంది. అందుకే ఇది టైర్ల పైనే మూత్రవిసర్జన చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి. కుక్కలు రబ్బరు టైర్ల పైనే మూత్రం పోయడానికి మరోక కారణం కూడా ఉంటుంది. ఇవి రబ్బరు వాసనను ఇష్టపడతా యటయట. అందుకే టైర్ కనిపిస్తే చాలు దాని దగ్గరికి వెళ్లి మూత్ర విసర్జన చేస్తాయి.
అయితే ఏవైనా కుక్కలు గనుక మీ వాహనాలపై పదే పదే మూత విసర్జన చేస్తుంటే, అవి అలా చేయకుండా అడ్డుకోవచ్చు. అందుకుగాను టైర్లపై ఉండే వాసనను పోగొట్టాలి. టైర్లపై మిరియాలు లేదా కారంపొడి చల్లాలి. దీంతో వాసన పోతుంది. అక్కడ మళ్ళీ కుక్కలు మూత్రం పోయవు. అలాగే మీరు ఇంట్లో వాడే ఏదైనా పెర్ఫ్యూమ్ ను టైర్లపై స్ప్రే కూడా చేయవచ్చు. ఆ వాసన కుక్కలకు పడదు. అలాగే కొద్దిగా వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు. దీంతో అవి మీ వాహనాల టైర్ల పై మూత్రం పోయకుండా ఉంటాయి. ఇలా కుక్కలు టైర్లపై మూత్రం పోయకుండా అడ్డుకోవచ్చు.