Advertisement
టీమిండియా ట్రోఫీని అందుకుని ఫేక్ ట్రాఫిక్ తో వస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు. స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ హీరోలను చూడడానికి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడ్డారు. టీం ఇండియా జట్టు నేరుగా ఢిల్లీలోకి చేరుకుంది. అక్కడినుండి ప్రధాన నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు రోహిత్ సేన. మోదీ తో పాటుగా బ్రేక్ఫాస్ట్ తీసుకుని ప్రపంచ కప్ విశేషాలు గురించి మాట్లాడుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో పాటుగా విరాట్ కోహ్లీ మోదీతో మాట్లాడారు.
Advertisement
తర్వాత అక్కడి నుండి ముంబై చేరుకున్నారు అయితే ఎక్కడ చూసినా వాళ్ళు ఫేక్ ట్రోఫీతోనే ఎందుకు కనబడుతున్నారు..? ఒరిజినల్ ట్రాఫి ఏమైంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… స్టేడియానికి సమీపంలో ఓపెన్ బస్సులో విక్టరీ పరేడ్ జరిగింది ఈ ప్రోగ్రాంను కళ్ళారా చూడడానికి లక్షలాది మంది ఫ్యాన్స్ వచ్చారు వీళ్ళ రాకతో ముంబైలో కోలాహలం ఏర్పడింది. భారీగా అభిమానులు నగరానికి రావడంతో ట్రాఫిక్ ఏర్పడింది ఇప్పుడు చర్చ ఏంటంటే ఫేక్ ట్రాఫి.
Advertisement
Also read:
ఫైనల్ ఫైట్ లో సౌత్ ఆఫ్రికాని ఓడించి ఛాంపియన్గా వచ్చిన భారత్ ఆటగాళ్లు ఎందుకు ట్రాఫిని తీసుకువచ్చారు అనేది చూస్తే.. సాధారణంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలో ఒరిజినల్ ట్రాఫి కేవలం ఫోటోషూట్ కి మాత్రమే ఇస్తారట విన్నర్ టీం తమ దేశానికి తీసుకువెళ్లడానికి అచ్చం అటువంటిదే ఇయర్, ఈవెంట్ లోగో తో కూడిన డూప్లికేట్ సిల్వర్ ట్రోఫీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. అసలు ట్రోఫీ దుబాయ్ లోని ఐసీసీ హెడ్ ఆఫీస్ లో ఉంటుంది. కనుక భారత్ అనే కాదు ఏ జట్టు గెలిచినా కూడా ఈ ట్రోఫీని ఇస్తారు. సెలబ్రేషన్స్, ఫోటో సెషన్ వరకు మాత్రమే ఒరిజినల్ ట్రోఫీని ఇస్తారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!