Advertisement
వర్షాకాలం వచ్చిందంటే మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో ఆ నీటిలో దోమలు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. దీంతో ఆ దోమలు రాత్రి సమయంలో మనల్ని ఎక్కువగా కుడతాయి. మరి ఇందులో ఏ దోమలు మనుషులని, జంతువులని ఎక్కువగా కుడతాయో ఓ సారి చూద్దాం..? మనల్ని సాధారణంగా ఆడ దోమలు కుడుతూ ఉంటాయి. మగ దోమలు కుట్టవు. అవి కేవలం చెట్ల రసాలు పీల్చుకొని జీవనం కొనసాగిస్తాయి. ఆడ దోమలు మాత్రమే మనుషుల యొక్క రక్తాన్ని పీల్చి జీవనాన్ని కొనసాగిస్తాయి.
Advertisement
పుట్టిన ఆడ దోమ తన జీవిత కాలంలో ఒక్కసారైనా మనిషిని కానీ లేదంటే ఏదైనా జంతువును కానీ కుట్టకుండా అస్సలు మరణించదు. అంటే ఆడ దోమలు పుట్టాయంటే తప్పనిసరిగా రక్తం పీల్చి బతకాలి అన్నమాట. ఆడ, మగ దోమలు కలిసిన తర్వాత గుడ్లు పెట్టే క్రమంలో దానికి ఏదైనా జంతువు రక్తం మాత్రం తప్పనిసరిగా అవసరమవుతుంది. ప్రతి 48 గంటలకు ఒకసారి అయినా జంతువులది లేదా మనుషుల యొక్క రక్తాన్ని తప్పనిసరిగా పీలుస్తుందట. ఎందుకంటే ఈ రక్తం తోనే దాని గుడ్లు పరిపక్వతకు వస్తాయి.
Advertisement
జంతువులు లేదా మనుషుల నుంచి పీల్చుకున్న రక్తంలో ప్రోటీన్లు, అమైనో ఆసిడ్ లను గ్రహించి దోమ దాని గుడ్ల పోషణకు వాడుకుంటుంది. ఈ విధంగా గుడ్లు పరిపక్వత చెందాక ఒకే సారి దోమ 100 గుడ్ల వరకు మురికి నీటిలో పెడుతుంది. ఈ గుడ్లు లార్వా గా మారి క్యూబా దశదాటి మళ్లీ దోమగా మారే క్రమంలో కచ్చితంగా మురికి నీరు ఉండాల్సిందే. ఆ నీరు లేకపోతే దోమలు వృద్ధి చెందే సైకిల్ ఆగిపోతుంది. అందుకే మన చుట్టూ ఎప్పుడైనా సరే మురికినీటిని నిల్వ ఉంచకూడదని అంటుంటారు. కాబట్టి దోమల వృద్దిని మనం ఆపాలి అంటే తప్పనిసరిగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
also read;
టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?