Advertisement
ఫ్లైట్లో వెళ్లడం వలన సమయం ఆదా అవుతుంది. చాలామంది టైం సేవ్ చేసుకోవడానికి ఫ్లైట్ జర్నీలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మామూలుగా రైలు బస్సులు ఎక్కువగా వెళుతూనే ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు మనకి అంతగా రావు కానీ విమాన ప్రయాణాలు రేర్ గా చేస్తూ ఉంటాం. కాబట్టి, విమానం ప్రయాణానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు మన మెదడులో మెదులుతూ ఉంటాయి. విమాన ఆకృతి, రెక్కలు, రంగు, పని చేసే విధానం గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. విమానంలో వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే విమాన కిటికీలు చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. సాధారణంగా బస్సుల్లో రైలులో కిటికీలని గమనించినట్లయితే అవి పెద్దవిగా ఉంటాయి.
Advertisement
విమానంలో వెళ్ళినప్పుడు ఆకాశమంత చూడడానికి చాలా బాగుంటుంది. నీలిరంగులో మబ్బులు కనపడుతూ ఉంటాయి వీటి అన్నిటిని చూడడం చాలా బాగుంటుంది అలాంటప్పుడు కిటికీలు కొంచెం పెద్దవిగా ఉండొచ్చు కదా..? ఎందుకు చిన్నవిగా గుండ్రంగా ఉంటాయి..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… విమానం కిటికీలు చిన్నవిగా ఉండడం వెనక పెద్ద కారణమే ఉంది. విమానం గాల్లో బాగా ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబిన్లో అధిక పీడనం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తరచు మారుతూ ఉంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేలా కిటికీలని రూపొందించారు విమాన సేఫ్టీ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి కిటికీ సైజుని చిన్నగా ఉంచుతారు.
Advertisement
కిటికీ పరిణామాన్ని కనుక పెంచినట్లయితే మొత్తం స్ట్రక్చర్ని దెబ్బతీస్తుంది. పైగా సేఫ్టీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కుదరదు. విమాన కిటికీలు పెద్దగా ఉంటే విమాన ఉపరితలానికి గాలి సాఫీగా ప్రవహించదు. వీటి పరిణామం పెంచడం వలన సామర్ధ్యం తగ్గుతుంది పెద్ద కిటికీలు ఉండడం వలన ప్రెజర్ లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. విమానం కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే చిన్న కిటికీలు ఉంటాయి చాలా దృఢంగా ఉండే ప్రత్యేక పదార్థాలతో ఈ కిటికీలను తయారు చేస్తారు ఒకవేళ పక్షులు కానీ చిన్న శిధిలాలు కానీ కిటికీలు ని తగిలినా ఎలాంటి నష్టం కూడా కలగదు పైగా ఈ కిటికీలు పలు పొరలుగా ఉండటం వలన అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడతాయి ఈ కారణాల వలనే కిటికీలు చిన్నవిగా గుండ్రంగా ఉంటాయి. ఇన్ని లాభాలు ఇలా కిటికీలు ఉండడం వలన ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!