Advertisement
ఇప్పుడు ప్రస్తుతం గీతాంజలి మరణానికి సంబంధించిన వార్తలు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ప్రాణాలను తీసుకుంది. ఈ విషయం పై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ మీడియాకి వివరాలని వెల్లడించారు. గీతాంజలి ఏడవ తేదీన ఆ$త్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. వెంటనే ఆమెని కుటుంబ సభ్యులు గుంటూరు జిజిహెచ్ కి తరలించారని చెప్పారు. మంగళవారం నాడు ఎస్పీ తుషార్ మీడియా తో మాట్లాడి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి దర్యాప్తు చేశారని చెప్పారు.
Advertisement
వారి దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా మనస్థాపానికి గురైందని తేలిందని చెప్పారు. రైల్వే పోలీసులు కేసుని తెనాలి వన్ టౌన్ కి ట్రాన్స్ఫర్ చేశారని తెలుస్తోంది అన్నారు. డిజిటల్ ఫుడ్ ప్రింట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని అన్నారు ఫేక్ ఐడి లు కొన్ని ఒరిజినల్ ఐడి లు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని గుర్తిస్తామని ఎవరినీ కూడా వదిలిపెట్టమని ఎస్పీ తుషార్ అన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలు అలానే ఆమెకి ప్రభుత్వం ద్వారా వచ్చిన స్కీం డబ్బులు గురించి ఆమె మీడియా తో షేర్ చేసుకున్నారు.
Advertisement
దీంతో తెలుగుదేశం జనసేన పార్టీల వాళ్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెపై దారుణమైన పోస్ట్స్ చేశారు ఇవన్నీ భరించ లేక గీతాంజలి ఇలా చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై రాజకీయ నాయకులు స్పందించారు సీఎం జగన్ సైతం ఈ విషయంపై మాట్లాడారు ఏది ఏమైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అలానే ఆమె పై పెట్టిన పోస్టులు కారణంగా మనస్థాపానికి గురై ఈ విధంగా ప్రాణాలని తీసుకోవడం అనేది ఘోరం. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి ప్రేమని ఇద్దరు పిల్లలు కూడా కోల్పోయారు కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!