Advertisement
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హీరో విశాల్ అలియాస్ విశాల్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు పోటీ గా వస్తారని..వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ప్రచారం జరిగినా పరిస్థితులు మారిపోయాయి. విశాల్ మాత్రం ఎటువంటి పోటీలోనూ కనిపించలేదు. అయిన అప్పట్లోనే చాలా మంది విశాల్ ఎందుకు కుప్పం నుంచి పోటీ చేస్తారు అంటూ ఆరాలు లాగారు.
Advertisement
కానీ.. విశాల్ మూడేళ్ళ నుంచి కుప్పంలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు విశాల్ ఎందుకు గ్రౌండ్ వర్క్ చేసారో కూడా ఎవరికీ తెలియదు. అసలు సినిమా నటుడు విశాల్ కు కుప్పం లో వర్క్ ఏంటి? అంటూ చాలా మందికి డౌట్ వచ్చింది. ఇంతకీ కుప్పంకు విశాల్ కు ఉన్న సంబంధం ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. విశాల్ తండ్రి జీకే రెడ్డి ఓ ప్రముఖ వ్యాపార వేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన వ్యాపారంలో ఓ వెలుగు వెలిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా ఆయన చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే విశాల్ కూడా కుప్పంలో ఉన్నారు. అప్పటికి విశాల్ సినిమాల్లోకి రాలేదు. తండ్రి వ్యాపారంలో విశాల్, విక్రమ్ లు చేదోడు వాదోడుగా ఉన్నారు.
Advertisement
ఆ సమయంలో కుప్పంలోని ప్రతి వీధి తిరిగానని, అక్కడి కాంట్రాక్టర్లతో కూడా తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్నీ ఇటీవలే విశాల్ మీడియా వేదికగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కూడా తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టానని.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం నాకు లేదని విశాల్ తెలిపారు. ప్రేక్షకుడు చూసే నా ప్రతి సినిమా టికెట్ పై నాకు ఒక రూపాయి వస్తుందని.. వాటితోనే నేను నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని విశాల్ తెలిపారు.
మరిన్ని..
జైలు జీవితం గడిపిన టాప్ 7 హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!
అమ్మాయిలు ఇది గుర్తుంచుకోండి.. మీ ప్రియుడు ఈ 5 పనులు చేస్తుంటే.. మీరంటే చాలా ప్రేమ అని అర్ధమట!