Advertisement
ప్రపంచవ్యాప్తంగా చాలా మతాలు ఉన్నాయి. ఏ మతం వాళ్లు ఆ మతం యొక్క ఆచారాలని పాటిస్తూ ఉంటారు. వారి సంప్రదాయాలని ఆచారాలని పాటిస్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ ఒకే విధంగా ఉండవు. ఒక్కో మతానికి చెందిన ప్రజలు ఒక్కో పద్ధతిని ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే ఏ మతాన్ని తీసుకున్నా కూడా అందులో తమ వర్గం జట్టు చనిపోతే పూడ్చడం కానీ కాల్చడం కానీ చేస్తారు. వాళ్ళ పద్ధతుల్ని పాటించి కార్యక్రమాన్ని జరుపుతారు. హిందూ మతంలో అయితే చనిపోయిన వ్యక్తులను దహనం చేయడం జరుగుతుంది అలా ఎందుకు దహనం చేస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? మరి ఇప్పుడే చూసేయండి.
Advertisement
బతికి ఉన్నప్పుడు మనిషి తెలియకో తెలుసో ఏదో ఒక పాపం చేస్తాడు కొంతమంది అయితే నిరంతరం పాపాలు చేస్తారు. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు హిందూమతంలో మాత్రం వారిని ఆచారం ప్రకారం దహనం చేయడం జరుగుతుంది. అగ్నిలో వేసి దహనం చేయడం వలన అతనికి ఉండే మరుసటి జన్మలో అతను పాపాలు చేయకుండా పరిశుద్ధుడై జీవిస్తాడట. అందుకనే హిందూమతంలో చనిపోయిన వాళ్ళని దహనం చేస్తారు అలానే మరో కారణం కూడా ఉంది. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఆత్మలని అంటిపెట్టుకొని ఉంటుందట. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లాలంటే దాన్ని దహనం చేయాలని అందుకని దహనం చేస్తారు.
Advertisement
అలా చేస్తే శరీరం నుండి ఆత్మ విడిపోయి ఇంకో దేహాన్ని చూసుకుంటుంది దహనం చేయనంత దాకా ఆత్మ తిరుగుతూ ఉంటుందట. అందుకనే హిందూ మతం ప్రకారం దహనం చేస్తారు. ఎవరిని దాహనం చేసినా కూడా నీటి ప్రవాహం ఉన్న నదులు చెరువులు వద్దే చేస్తారు. దీంతో ఆత్మ పరిశుద్ధమవుతుందని అంటారు. దహనం చేసిన తర్వాత వచ్చే బూడిదని నీటిలో కలుపుతారు. అలా చేయడం వలన ఆత్మ పంచభూతాలలో కలుస్తుంది అంటారు. ఆ తర్వాత 13వ రోజున పిండ ప్రధానం చేస్తారు. దీంతో ఆత్మకి విముక్తి కలిగి మరొక దేహంలోకి వెళ్తుంది ఇదంతా కూడా మనం అంతిమ సంస్కారం అని అంటాము మనిషికి తన జీవిత కాలంలో జరిగే సంస్కారాలలో చివరిది ఇదే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!