Advertisement
మన హిందూ సంప్రదాయం ప్రకారం.. మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా పురుషులు మంగళవారం రోజున కటింగ్ అస్సలు చేయించుకోరు. అసలు మంగళవారం కటింగ్ చేయించుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటి.. ఎవరు ఇలా చెప్పారనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
వివరాల్లోకి వెళితే.. మంగళవారం అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ్ అని కూడా అంటారు. ఇది మార్స్ మంగళ్ ద్వారా పాలించబడుతుంది.
ఈ గ్రహం ఎరుపు వర్ణానికి చిహ్నం. ఈ గ్రహం అధిక వేడిని కలిగి ఉంటుంది. మానవ శరీరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెబుతుంటారు.
Advertisement
ఆ రోజున శరీరంపై ఎక్కువగా గాయాలు అవడానికి ఆస్కారం ఉంటుందట. గాట్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్లనే ఆ రోజు కటింగ్ చేసుకోరు. గోర్లు కత్తిరించుకోవడం కూడా చేయకూడదని ఆచారం ఉంది. కాబట్టే.. ప్రతి మంగళవారం రోజున గోర్లు కత్తిరించడం గానీ కటింగ్ చేయించుకోవడం గానీ చేయవద్దంటారు. అంతేకాకుండా ఆ రోజు కటింగ్ షాపులు సైతం మూసి ఉంచి బార్బర్లు అందరూ సెలవు తీసుకుంటారు.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?