Advertisement
భారతదేశంలో ముఖ్యంగా హైవేలో ట్రక్స్ వెనుక హార్న్ ఓకే ప్లీజ్ అని రాస్తూ ఉంటారు. అయితే చాలా శాతం మందికి దాని వెనుక కథ ఏమిటో తెలియకపోయినా ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తూ వస్తారు. నిజానికి ఇది 20వ శతాబ్దం నుండి నుండే ప్రారంభమైంది. అప్పుడు సరైన రోడ్లు లేకపోవడం వలన ఎలాంటి సేఫ్టీ పాటించకపోవడం వలన హార్న్ ఓకే ప్లీజ్ అని రాయడం ప్రారంభించారు. అయితే చాలా మంది ఈ వాక్యాన్ని ఎంతో అందంగా ట్రక్స్ వెనకాల రాస్తూ ఉంటారు.
Advertisement
ఇది వరకు రోడ్లు ఎంతో చిన్న గా ఉండడం వలన పెద్ద ట్రక్కులను ఓవర్టేక్ చేయడానికి కష్టమయ్యేది. దాంతో ఓవర్ టేకింగ్ ను సురక్షితం చేయడానికి కొంతమంది ఓకే సైన్ పైన బల్బును పెట్టేవారు. ఈ విధంగా హార్న్ ఓకే ప్లీజ్ అని వచ్చింది. మరికొందరు అయితే ఈ వాక్యం వరల్డ్ వార్ 2 సమయంలో డీజిల్ కొరత రావడం వలన ఆన్ కిరోసిన్ అనే వాక్యాన్ని ఉపయోగించేవారు, అంటే ఏ వాహనాలు అయితే కిరోసిన్ ఉపయోగించి నడుపుతారో వారు ఆన్ కిరోసిన్ లేదా ఓకే అనే పదాన్ని ఉపయోగించేవారు.
Advertisement
Also read:
హార్న్ ఓకే ప్లీజ్ లో ఓకే ఈ విధంగా వచ్చింది అని కొంతమంది నమ్ముతారు. అంతేకాక టాటా గ్రూప్ “ఓకే” సోప్ లను తయారు చేసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కోసం బిల్ బోర్డ్స్ తో పాటుగా ట్రక్ వెనకాల ఓకే అని పెయింట్ చేసారు. ఈ విధంగా హార్న్ ఓకే ప్లీజ్ ను అన్ని ట్రాక్టర్ల పై రాయడం ప్రారంభించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!