Advertisement
భారతదేశంలో హార్న్ ఓకే ప్లీజ్ అన్న వాక్యం వాహనాల పై చూస్తూ ఉంటాం, అయితే ఈ వాక్యం ఎంతో ప్రమాదమైనది అని కొంతమంది అంటూ ఉంటారు. హైవే లో మాత్రమే కాకుండా సాధారణమైన రోడ్లలో వెళ్లే వాహనాల వెనుక కూడా హార్న్ ఓకే ప్లీజ్ అని ఉంటుంది. అయితే దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితి అని కొందరు అంటూ ఉంటారు.
Advertisement
ఆ సమయంలో భారత్ లో ట్రక్కుకు సరిపడా డీజిల్ సరఫరా లేకపోవడంతో కిరోసిన్ తో నడిచేవి దాంతో ఆ వెహికల్స్ వెనుక ఆన్, కిరోసిన్, ఓకే అనే పదాలను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ విధంగానే హార్న్ ఓకే ప్లీజ్
అనే వాక్యం వచ్చింది. కాకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వాక్యాన్ని పదేళ్ల క్రితమే నిషేధించడం జరిగింది. ఎలాంటి అర్థం లేని ఈ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం వలన వెనక వచ్చే వాహనాలు హారన్ కొట్టేలా చేస్తున్నాయి అనే వాదన వచ్చింది.
Also read:
Advertisement
దాంతో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని ఈ వాక్యాన్ని నిషేధించడం ప్రారంభించారు. ఇదే నిర్ణయాన్ని జాతీయ లారీల అసోసియేషన్ కూడా అంగీకరించింది. ఇదివరకు భారత్ లో రోడ్లు కూడా బాగుండేవి కాదు దాంతో హారన్ కొట్టి సిగ్నల్ ఇచ్చి తరువాతే ఓవర్టేక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రహదారులు అన్నీ కూడా చాలా పెద్దవిగా మల్టిపుల్ లైన్స్ తో ఉండడం వలన హార్న్ ఓకే ప్లీజ్ వంటివి ఉపయోగించాల్సిన అవసరం లేదు అని
వాహనదారులు కూడా భావిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!