Advertisement
చాలామంది క్రికెట్ ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఇండియా జట్టు క్రికెట్ ఆడిందంటే ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. వరల్డ్ కప్ మ్యాచ్లు హైదరాబాదులో ఎక్కువగా జరగవు. ఈసారి హైదరాబాదులో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఎందుకు ఎక్కువ అవ్వడం లేదు.. టీమ్ ఇండియా మ్యాచ్లు ఎందుకు లేవు అనేది ఈరోజు తెలుసుకుందాం. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, కేవలం మూడు అంటే మూడు మ్యాచ్లు జరుగుతున్నాయి.
Advertisement
అయితే అందులో రెండు మ్యాచ్లు పాకిస్తాన్ క్వాలిఫైయర్ టీం లతో ఆడుతుంటే.. ఇంకో మ్యాచ్ న్యూజిలాండ్ క్వాలిఫైయర్ వన్ టీం తో ఆడబోతోంది. కానీ టీమ్ ఇండియా మాత్రం హైదరాబాదులోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు. ఢిల్లీ చెన్నై, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, లక్నో వేదికల్లో జరగబోతున్నాయి.
Advertisement
కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక వరల్డ్ కప్ మ్యాచ్ కూడా లేదు. 2021 t20 వరల్డ్ కప్ కి ముందు షెడ్యూల్ విడుదల చేశారు. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్లో జరగాల్సి ఉంది కానీ కరోనా వలన ఈ మ్యాచ్లన్నీ కూడా యూఏఈ లో జరిగాయి. ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్లు నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనితీరు బాలేదు. అందుకనే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఏమీ కూడా ఇక్కడ నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు అని అన్నారు.
కానీ అసలు కారణం మరొకటి ఉంది. 2023 ఆఖరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2023 డిసెంబర్లో కానీ అంతకంటే ముందు కానీ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకనే హైదరాబాద్ లో మ్యాచ్లు నిర్వహించడం లేదు. పోలీసులకి సెక్యూరిటీ ఇవ్వడానికి కష్టం అయిపోతుంది. అందుకే ఎక్కువగా ఇక్కడ ఈసారి నిర్వహించడం లేదు.
Also read:
ప్రాజెక్ట్ K’ లో విలన్ కోసం… కమల్ హాసన్ కంటే ముందు ఆ హీరోని.. కానీ ప్రభాస్ వద్దు అన్నాడా..?
హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ కొట్టిన టాలీవుడ్ సీన్లు ?
చాణక్య నీతి: ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి, లైఫ్ లోకి రానివ్వద్దు.. సమస్యలే..!