Advertisement
క్రికెట్ ఆటని చాలా మంది చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు మన జట్టు విజయాన్ని వాళ్ల విజయంగా భావించి ఆనంద పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే టీమిండియా ఐసీసీ ట్రాఫిని గెలిచి చాలా కాలం అయిపోయింది. 2013 లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన తర్వాత మళ్లీ ఒక్క ఐసీసీ ట్రాఫిని కూడా ఇండియా టీం సొంతం చేసుకోలేదు. అభిమానులు ఎంతగానో అసలు పెట్టుకున్నా కూడా ఓటమే ఎదురైంది. ఇండియా ఐసీసీ ట్రాఫి గెలవకపోవడం చాలా రోజుల నుండి చూస్తున్నాము. అయితే ఎందుకు టీమిండియా ఐసీసీ ట్రాఫి ని గెలవలేక పోతోంది ముఖ్య కారణాలు ఏంటి అనేది ఇప్పుడే చూసేద్దాం.
Advertisement
2013 నుండి కూడా ఒక్క ఐసీసీ ట్రాఫిని కూడా టీం ఇండియా సొంతం చేసుకోలేదు. గత పది ఏళ్ల నుండి చూస్తే మొత్తం తొమ్మిది గంటలు జరిగాయి. నాలుగు టీ 20 వరల్డ్ కప్ లు, రెండు ఒడిఐ వరల్డ్ కప్ లు, రెండు చాంపియన్షిప్ లు అలానే ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి ఇలా మొత్తం తొమ్మిది వాటిల్లో కూడా టీమిండియా పాల్గొంది. కానీ ఒక్క దానిలో కూడా కప్ ని కొట్టలేకపోయారు. పైగా వేరే టీంలు ఎక్కువ డామినేట్ చేసి కప్ కొట్టిన తీరు కూడా మనం చూడలేదు.
Advertisement
అన్ని జట్లకు కూడా కప్ ని కొట్టే ఛాన్స్ వచ్చింది కానీ టీమ్ ఇండియా కి మాత్రం కప్ ని సొంతం చేసుకోలేదు. దీని వెనుక కారణమేమిటంటే టాప్ ఆర్డర్ లో ఉండే బ్యాట్స్మెన్స్ సరిగ్గా రన్స్ ని స్కోర్ చేయకపోవడం అని చెప్పొచ్చు. 2013 ముందు చూసుకున్నట్లయితే టాప్ ఆర్డర్ లో ఉండే బ్యాట్స్ మెన్స్ మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చారు. ఎక్కువ రన్స్ ని స్కోర్ చేసారు.
2015 వరల్డ్ కప్ 2017 ఛాంపియన్షిప్ 2019 వన్డే వరల్డ్ కప్ ఇలా ఈ మ్యాచుల్లో చూసుకున్నట్లయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విఫలం అయ్యారు. ఎక్కువ రన్స్ ని స్కోర్ చేయలేదు. ఇలా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వలన మ్యాచ్లు ఓడిపోవలసి వచ్చింది. 2013 కి ముందు బ్యాట్స్మెన్స్ ఎంతో కొంత నిలబడ్డారు. అలానే కొన్ని మ్యాచ్లలో వర్షం వలన అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యమైన ప్లేయర్లకి గాయాలు అవ్వడం వలన కూడా మ్యాచ్ మీద బాగా ప్రభావం పడింది.
Also read:
కుటుంబం కోసం లైఫ్ ని త్యాగం చేసిన.. 8 స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!