Advertisement
కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించేది, లేదా మరింత ఖచ్చితంగా, ఒక కాంతి స్తంభం అని అర్థం. ఎవరు కూడా ఈ స్థలం ఎంత ప్రాచీనమైనది లెక్కపెట్టలేరు. ఎథెన్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయని ఈ సమయంలోనే కాశి ఉంది. ప్రజల ఆలోచనలో రోమ్ నగరం ఇంకా పుట్టకమునుపే కాశీ నగరం ఉంది. కాశి అనేది అండపిండ బ్రహ్మాండ ల మధ్య ఐక్యతను తీసుకువస్తుంది. అయితే చాలామంది కాశీని వారణాసి అని కూడా అంటారు. అసలు కాశీ వారణాసి అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు చూద్దాం.
Advertisement
Also Read: దర్శకులని ప్రేమించి, పెళ్లి చేసుకుని.. విడాకులు ఇచ్చిన 4 హీరోయిన్స్ వీరే ?
Advertisement
గంగానదిలో రెండు చిన్న నదులు వరుణ మరియు ఆస్సి అనే రెండు నదుల సంగమ ల మధ్య ఉన్నది. అందుకే కాశీని వారణాసి అని పిలుస్తారు. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం మరియు దక్షిణాన ఆస్సీ నదీసంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారణాసి అని పేరు ఉండేది.
అందుకేనా ఆ నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ రెండవ అభిప్రాయాన్ని ఎవరూ నమ్మలేదు. వారణాసి అనే పేరును పాళీ భాషలో బార నాసి అని రాసేవారు. అది కూడా బవరస్ గా మారిపోయింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్తక, మహా స్మశాన, రమ్య మరియు కాశి అనే వివిధ పేర్లతో పిలిచేవారు.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!