Advertisement
హిందువులు సాధారణంగా ఏ దేవుణ్ణి అయినా నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రమే దైవదర్శనం భిన్నంగా ఉంటుంది. అభిషేక ప్రియుడు, సృష్టి స్థితి లయకారుడు, త్రిమూర్తులలో చివరివాడు శివుడు. ఆ పరమశివున్ని ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నందికొమ్ముల నుంచి చూస్తూ దైవ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాతే ఆలయంలోకి వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. అయితే ఇలా ఎందుకు దర్శనం చేసుకోవాలి? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
ఆ పరమేశ్వరునికి విగ్రహ రూపం ఉండదు. వరాహ పురాణంలోని ఓ చరిత్ర శివున్ని లింగ రూపంలో ఎందుకు పూజిస్తారో తెలిపింది. వరాహ పురాణంలో బృగు మహర్షి చాప ఘట్టంలో భృగు మహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోడు. దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపం ఇస్తాడు. ” నేటి నుండి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు. నీ విగ్రహానికి పూజలు అందవు. నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అంటూ వెళ్ళిపోతాడు. అప్పటినుండి శివున్ని లింగ రూపంలో కొలుస్తారు. ఇక శివుడు లయకారకుడు. ఆయన తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతం అవుతుంది.
Advertisement
అంతటి శక్తి ఉన్న పరమశివున్ని నేరుగా దర్శించుకోకూడదు. దర్శించుకుంటే అరిష్టం కలుగుతుంది. అందుకే ముందుగా ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శించుకోవాలి. ఇక నంది కొమ్ముల నుంచి దర్శించుకుంటున్నప్పుడు చేత్తో నంది వీపును నిమరాలి. ఆ తరువాత గుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. ఆ తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరు వెళ్ళకూడదు. అందుకనే నంది కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాలి. ఇలా శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే భక్తులకు కైలాస ప్రాప్తి కూడా కలుగుతుందట. మరో జన్మ కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
Read also: టాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ సాధించిన హీరోలు ఎవరంటే ?