Advertisement
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం..? మనం యూస్ చేస్తున్నా టెలికాం కంపెనీల డాటా వ్యాలిడిటీ 28 రోజుల వరకే ఉంటుంది.
Advertisement
మరి అలా ఎందుకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా..? ఉదాహరణకు ఒక రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫుల్ మంత్ వ్యాలిడిటీ ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మనం సంవత్సరానికి కేవలం పన్నెండు సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తాం. అయితే ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే వ్యాలిడిటీ వస్తే మాత్రం అప్పుడు ప్రతి నెలలో రెండు రోజులు మిగిలిపోతాయి. అలా 12 నెలలకు రెండు రోజుల చొప్పున లెక్కిస్తే ఇరవై నాలుగు రోజులు వస్తుంది. అలాగే అందులో కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి. అవి ఏడు రోజులు వచ్చిన, ఫిబ్రవరి లో 28 రోజులు ఉంటాయి. ఈ విధంగా మిగిలిన రోజులు అన్ని కలుపుకుంటే సుమారుగా 30 రోజుల వరకు వస్తుంది.
Advertisement
అంటే పూర్తిగా ఒక నెల అన్నమాట. సింపుల్ గా అర్థం కావాలంటే. సంవత్సరానికి 365 రోజులు, 365÷28 వేస్తే 13 నెలలు వస్తాయి. అంటే సంవత్సరానికి పన్నెండు రీఛార్జ్ చేయవలసిన మనం 13 రీఛార్జ్ చేయవలసి వస్తుంది. అంటే ప్రతి కస్టమర్ మీద ఒక నెల అమౌంట్ ఎక్కువగా వస్తుంది. ఇలా రావడం వల్ల టెలికం కంపెనీలకు లాభం ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే జియో కంపెనీ కి దాదాపు ఆరు వేల కోట్ల పైన లాభం ఉంటుంది. ఎయిర్టెల్ కంపెనీకి దాదాపు ఐదువేల కోట్లు లాభం ఉంటుంది. వోడాఫోన్ ఐడియా కి మూడు వేల కోట్లకు పైగా ఇన్కమ్ ఉంటుంది.
also read;
హీరో వెంకటేష్ బావ కూడా.. ఒక స్టార్ విలన్.. ఎవరంటే..?