Advertisement
రైళ్ల గురించి తెలియని వారుండరు. అలాగే రైలు, రైల్వే స్టేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. మనం ఇప్పటివరకు ఎన్నో సార్లు రైలులో ప్రయాణం చేసి ఉంటాం. లేదా కనీసం రైలుని చూసి అయినా ఉంటాం. అయితే రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుండి భోగి వరకు, రైలు ఇంజన్ నుండి లోపల తిరిగే ఫ్యాన్ ఇలా వరకు అన్ని ఆసక్తికరమే. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీలోంచి బయటకి చూస్తూ ఉంటాం.
Advertisement
READ ALSO : ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?
Advertisement
అయితే, మనదేశంలోని కొన్ని రైల్వేస్టేషన్ల పేరు చివర రోడ్డు అనే పదాన్ని తగిలిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ పేరు వెనుక రోడ్డు అని తగిలించారంటే ఆ స్టేషన్ నగరానికి దూరంగా ఉందని అర్థం. దీనిని తెలియజేసేందుకు రోడ్డు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే అక్కడి నుంచి ఉన్న రహదారి మీదుగా నగరానికి వెళ్లాల్సి ఉంటుందని అర్థం. అంటే మీరు నగరానికి కొంత దూరంలో రైలు దిగారని అర్థం. రైల్వే అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ తో అనుసంధానమైన ‘రోడ్డు’ అనే పదం ఆ రైల్వే స్టేషన్ నుండి ఆ నగరానికి వెళ్లడానికి కొద్దిగా దూరం ఉందని అర్థం.
ఆ నగరానికి వెళ్లే రైలు ప్రయాణికులు అక్కడే దిగాలని ఆ స్టేషన్ బోర్డు సూచిస్తుంది. అయితే ఆ నగరానికి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఈ తరహా స్టేషన్ నుండి…నగరం 2 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కొడైకెనాల్ నగరం, కొడైకెనాల్ రోడ్డు రైల్వే స్టేషన్ నుండి 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే విధంగా హజారీబాగ్ రోడ్ రైల్వే స్టేషన్ హజారి బాగ్ సిటీ నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాంచి సిటీ రాంచీ రోడ్ స్టేషన్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.
READ ALSO : ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు