Advertisement
సాధారణంగా విజయదశమి రోజు ప్రతి ఒక్కరూ పాలపిట్టను చూసి జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటారు.. మరి జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు అనేది చాలా మందికి తెలియదు.. దాని వెనుక పెద్ద కథ ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. శమీ వృక్షాన్ని దేవతా రూపంగా భావిస్తారు. ఎందుకంటే దీని వేర్లు చాలా లోతుగా వెళ్తాయి. ఎలాంటి కాలం వచ్చినా ఈ చెట్టు ఎండిపోదు. దాని వేర్లు చాలా లోతుగా వెళ్లి నీరు గ్రహిస్తాయి. వేర్లు లోతుగా వెళ్లడం వల్ల చెట్టు కూడా దృఢత్వంగా ఉంటుంది.
Advertisement
దసరా 2022
కాబట్టి జమ్మి వృక్షాన్ని దృఢత్వానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృక్షానికి పూజ చేస్తే మనలో కాన్ఫిడెన్సు పెరిగి ఏ పనినైనా ఇట్టే సాధించే శక్తి వస్తుందని అనుకుంటారు. అలాగే విజయదశమి రోజు చాలా శుభ కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా రకాల వృత్తుల వాళ్ళు వారి యొక్క పనిముట్లను ఈ జమ్మి వృక్షం దగ్గర పెట్టి ఆరాధిస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..
Advertisement
ALSO READ; మీ పిల్లలకు పేర్లు పెట్టాలా.. ఈ 3 అక్షరాలతో పెడితే చాలా అదృష్టం..!!
ఈ వృక్షాన్ని మనకు ఉన్న తొమ్మిది గ్రహాలతో పోల్చిచూస్తే శనీశ్వరుడుకి సంబంధించినది.. కాబట్టి ఈ వృక్షం కింద పనిముట్లను పెట్టి పూజిస్తే మనం ఏ పని మొదలు పెట్టిన ఆటంకం కలగకుండా ఎలాంటి శని లేకుండా తొలగిస్తాడని భావిస్తూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధించి అష్ట ఐశ్వర్యాలు కలగాలని శని దేవుని కోరుకుంటూ వృక్షం కింద పూజ చేస్తూ ఉంటారు. దీనివల్ల శని యొక్క అనుగ్రహం కలిగి మనం ఎలాంటి పనులు మొదలు పెట్టిన శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆరాధిస్తారు.
ALSO READ:ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !