Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రముఖులు శ్రీకాంత్ మరియు చిరంజీవి కార్ల పట్ల మక్కువ కలిగిన వారిలో ముందుంటారు. వీరి వద్ద ఇప్పటికే చాలా రకాల కార్ కలెక్షన్ ఉంది. వీరిద్దరూ కాకుండా ఇంకెవరికైనా కార్ కలెక్షన్ పై ఇంటరెస్ట్ ఉంది అంటే.. అది జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల, అతను ప్రఖ్యాత బ్రాండ్ ఫారెన్ నుండి 5 కోట్ల రూపాయలకు మించిన లగ్జరీ పెట్టుబడితో లాంబోర్గిని కార్ ను కొనుగోలు చేసాడు. చాలా మంది సెలెబ్రిటీలు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.
Advertisement
కానీ, జూనియర్ ఎన్టీఆర్ వద్ద ఉన్న కార్ కలెక్షన్స్ లో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ కార్లన్నీ ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ ని కలిగి ఉంటాయి. ఆయన వద్ద ఉన్న రేంజ్ రోవర్, BMW కారు రెండూ కూడా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు సెంటిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా, చాలా మంది నటీనటులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయానికి వస్తే సెంటిమెంట్లకు కట్టుబడి ఉంటారు. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) తన కారు నంబర్ 9999తో ఒక సెంటిమెంట్‌ను ఫీల్ అవుతారట.
Advertisement
అయితే ఇది రూమర్ అని తేలింది. తాను ప్రత్యేకంగా సెంటిమెంట్‌లకు కట్టుబడి ఉండనని, అయితే 9 నంబర్‌తో తనకు అనుబంధం ఉందని ఎన్టీఆర్ స్వయంగా స్పష్టం చేశారు. తన తాత కారుకు 9999 నంబర్ ఉందని, తన తండ్రి కూడా అదే నంబర్‌ను ఉపయోగించారని, అందుకే తానూ కార్ రిజిస్ట్రేషన్ విషయంలో ఆ నెంబర్ పై ఇంటరెస్ట్ చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరెప్పుడైనా గమనించారా? ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతాలో కూడా 9999 నంబర్ ఉంటుంది.
మరిన్ని..