Advertisement
సాధారణంగా హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది. అలాగే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు ఉంటాయి. శివుడి చేతిలో ఢమరుకం, సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి. అలాగే కృష్ణుడి చేతిలో వేణువు ఉంటుంది. వేణువులోని మాధుర్యం ఇంత అంతా కాదు. శ్రీకృష్ణుడి కి వేణువుని ఎవరు ఇచ్చారు అనే విషయం చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు.
Advertisement
Advertisement
ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భూమిపై జన్మించారు. ఒక రోజు శివుడు శ్రీకృష్ణుడి ని కలవాలని అనుకున్నారు. విష్ణువు శివుడు స్నేహం బాగా బలపడడంతో ప్రత్యేక బహుమతి ఇవ్వాలని ఈశ్వరుడు అనుకున్నాడు. ఆ వేణువుని ఇచ్చి పరమశివునికి కానుక అని చెప్పారు. ఎల్లప్పుడూ తనతో పాటుగా ఈ బహుమతిని ఉంచుకోవాలని శివుడు కృష్ణుడితో చెప్పారట.అయితే వేణువు సుస్వరాయనాదం మాత్రమే కాదు మతపరమైన రక్షణకి చిహ్నం అని శివుడు నిర్ణయించారు.
దడిచి ఎముకలతో చేసిన వేణువు అది. దడిచి మహర్షి లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేశారు. మహా శక్తి శరీరంలోని అన్ని ఎముకలని దానం చేశారని చెబుతారు. ఈ ఎముకలతో పినాక, గాండీవ, సారంగా అనే విల్లులని తయారు చేశారు ఆ ఎముకలని చూర్ణం చేసి వేణువుని చేశారు. శివుడు ఆ వేణువుని కృష్ణుడికి ఇచ్చారు.