Advertisement
సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు కృష్ణ. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ లకి కూడా కృష్ణ అంటే ఎంతో ఇష్టం. కృష్ణ మొదటి భార్య ఇంద్ర దేవి. ఇంద్ర దేవి కృష్ణ కి ఐదుగురు పిల్లలు ఉన్నారు. స్టార్ హీరోగా కృష్ణ ఒక వెలుగు వెలుగుతున్న టైంలో మొదటి సంతానమైన పద్మావతికి గల్లా జయదేవ్ ని ఇచ్చి పెళ్లి చేసారు కృష్ణ.
Advertisement
చెన్నైలో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళ పెళ్లి గురించి అప్పుడు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా మాట్లాడుకున్నారు. వీళ్ళ పెళ్లికి తమిళనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు. తమిళనాడు సీఎం మరియు హీరోయిన్ జయలలితని కూడా రావాలని ఇన్వైట్ చేశారు కృష్ణ ఆమె కూడా వివాహానికి రావడానికి నిర్ణయించుకున్నారు.
Advertisement
జయలలితకి అప్పటికే ఒక సారి అసెంబ్లీలో జరిగిన సంఘటన వల్ల విపరీతమైన సెక్యూరిటీ ఉండేది. పెళ్లి జరుగుతున్న టైం లో అప్పటికే ఒకసారి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అంతా చెక్ చేసి వెళ్లారు. పెళ్లిలో ముందు రెండు వరుసలు ఖాళీ చేయాలని ఎక్కువ మంది ఆమెతో పాటుగా వస్తారని చెప్పారు. కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
పెళ్లికి ఎంతోమంది ముఖ్యులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మంత్రులు కూడా వస్తారు. వాళ్ళందరిని పంపించడం మంచిది కాదు. కావాలంటే జయలలితనే పెళ్లికి రావద్దని జయలలితతో కృష్ణ చెప్పేశారు. దాంతో జయలలిత కూడా విషయాన్ని అర్ధం చేసుకుని పెళ్లికి వెళ్లకుండా కానుకని పంపించారు.
Also read: