Advertisement
నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 8న తన ప్రియురాలు శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ప్రకటించారు. నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొత్త కోడలు శోభిత అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానాన్ని పలికారు. నాగచైతన్య శోభితలను మనస్పూర్తిగా ఆయన ఆశీర్వదించారు. నాగచైతన్య నిశ్చితార్థం వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది. నాగార్జునతో విడిపోయిన లక్ష్మీ అమెరికాలో సెటిల్ అయ్యారు.
Advertisement
నాగచైతన్య బాల్యంలో తల్లి దగ్గర పెరిగాడు. హీరోగా మాత్రం నాగర్జున లాంచ్ చేశారు. కొడుకు నిశ్చితార్థం వేడుకకు తల్లిని లక్ష్మీ రాకపోవడం వెనక బలమైన కారణం ఉందట. సమంతతో నాగచైతన్య విడిపోవడం దగ్గుబాటి లక్ష్మికి అస్సలు ఇష్టం లేదట. సమంతని కోడలుగా ఆమె మనస్పూర్తిగా స్వీకరించారు. విడాకుల విషయంలో నాగచైతన్య తప్పు అని భావిస్తున్నారట. నాగచైతన్య తో తల్లి గతంలో మాదిరి అన్యోన్యంగా ఉండట్లేదు.
Advertisement
Also read:
నాగచైతన్య లక్ష్మీ పెద్దగా మాట్లాడుకోవడం లేదట. అతనిపై ఆమె కోపంగా ఉన్నారట. అదే సమయంలో సమంతతో ఆమె టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిన లక్ష్మి చాలా వేదనకి గురయ్యారట. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వారట. నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సమంతతో విడాకుల పరిణామం దగ్గుబాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంతా అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!