Advertisement
ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. అటు జనసేన, టీడీపీ కలిసి ఈసారి పోటీ చేయబోతున్నాయి. అలానే వైసిపి కూడా ఎలక్షన్లకి సిద్ధమయ్యింది. పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ కి గొడవ జరిగిందా..? జెండా సభకి చంద్రబాబుతో పాటుగా లోకేష్ రాకపోవడం వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జెండా సభకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. జనసేనకు సంబంధించి ఇతర నాయకులు కూడా ఈ సభకి వచ్చారు.
Advertisement
అలానే టీడీపీ కి సంబంధించిన నాయకులు కూడా ఈ సభకి హాజరయ్యారు. టికెట్ రాకపోయినా దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఈ సభకి హాజరయ్యారు పార్టీలోకి చేరకుండా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంది నేతలు ఈ సభకి వచ్చారు కానీ అతి ముఖ్యమైన నారా లోకేష్ మాత్రం రాలేదు. చంద్రబాబు తర్వాత టీడీపీ కి పెద్ద అయినా నారా లోకేష్ ఈ జండా సభకి హాజరు కాకపోవడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
Advertisement
అయితే నారా లోకేష్ ఒక సభలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తున్నాం కానీ పవర్ షేరింగ్ అన్న మాట లేదని ఒక సభలో నారా లోకేష్ అన్నారు. ఇలా నారా లోకేష్ అనడంతో జనసేన కార్యకర్తలకు కాస్త కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ కి ఈ విషయంపై కోపం వచ్చినా జగన్ ని ఓడించడానికి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో చెప్పారట. సీఎం సీటు విషయంలోనే కాకుండా సీట్ల లెక్కింపు విషయంలో కూడా నారా లోకేష్ కామెంట్స్ చేశారు ఐదవ వంతు కంటే తక్కువ సీట్లు, జనసేనకి ఉండొచ్చని ఒకసారి కామెంట్ చేశారు విభేదాలు వచ్చాయి.
అయితే ఈ సభకి లోకేష్ వస్తే నేను రాను అని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి చెప్పారట ఎవరో ఒకరిని ఎంచుకోమని చెప్పడంతో నారా లోకేష్ ఈ సభకి రాలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సభ నిర్వహించారు అని వైసిపి మీడియా చెప్తోంది. అలానే నారా లోకేష్ వస్తే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి ఒకే రకమైన ప్రాధాన్యతని అందరూ ఇవ్వచ్చని అందుకని లోకేష్ ని ఆపేసినట్లు వైసిపి మీడియా చెప్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!