Advertisement
రాధాకృష్ణులు ప్రేమకి ప్రతిరూపం. ప్రేమకు ఆధ్యాత్మిక బంధానికి శాశ్వత భక్తికి దైవిక అనుబంధానికి వారు ప్రతీక. కృష్ణుడు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే సందేహం చాలా మందిలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.. కృష్ణుడు అంటే రాధ మనకి గుర్తొస్తారు. ప్రేమ అంటే రాధాకృష్ణుని గురించి మాట్లాడుకుంటారు. ప్రేమ ఆధ్యాత్మిక బంధం అన్నిటిని ఈ బంధం హైలైట్ చేస్తుంది. రాధాకృష్ణుల మధ్య ఉన్న సంబంధం సాంప్రదాయ వివాహం కంటే దాని లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? రాధను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఉందట.
Advertisement
Advertisement
భూమిపై కృష్ణుడు రాక కి ఉద్దేశం మానవాళికి బోధించడం మార్గం నిర్దేశం చేయడం రాధ ని పెళ్లి చేసుకోవడం అతని దైవిక లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించడం కిందకి వస్తుంది. బదులుగా వారి సంబంధం భగవంతునికి వ్యక్తి ఆత్మకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని హైలెట్ చేస్తుంది. అయితే భౌతిక బంధాల కంటే భక్తికి ప్రాధాన్యతని ఇస్తుంది.
Also read:
కృష్ణుని జీవితం నైతిక ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఉద్దేశించిన దైవిక లీలలు అని చెప్తారు. కృష్ణుని పట్ల రాధ ప్రేమను అత్యంత స్వచ్ఛమైన భక్తిగా భావించడం జరిగింది. వారి కథ దైవం భక్తుల మధ్య ఆదర్శవంతమైన సంబంధం సూచిస్తుంది. ఈ దైవిక ప్రేమ శాశ్వతమైనది. అది పెళ్లి అనే బంధంతో పరిమితం కాకూడదని కృష్ణుడు వివాహం చేసుకోలేదట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!